Home> లైఫ్ స్టైల్
Advertisement

Bad Cholesterol: డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్‌తో చెడు కొలెస్ట్రాల్‌ 7 రోజుల్లో కరగడం ఖాయం..

Dragon Fruit For Bad Cholesterol: ప్రస్తుతం చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన డ్రాగన్ ఫ్రూట్స్ ప్రతిరోజు రెండు పూటలా తినాల్సి ఉంటుంది.
 

Bad Cholesterol: డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్‌తో చెడు కొలెస్ట్రాల్‌ 7 రోజుల్లో కరగడం ఖాయం..

Dragon Fruit For Bad Cholesterol: భారతీయులంతా ఆయిల్ ఫుడ్స్ ను అతిగా తింటూ ఉంటారు. దీని కారణంగా చాలామందిలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొవ్వు పరిమాణం పెరగడం కారణంగా గుండెపోటు, మధుమేహం, కార్డినల్ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో పోషకాలు కలిగిన పనులను ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలోని చెడు కొవ్వులను తగ్గించుకోవడానికి తప్పకుండా డ్రాగన్ ఫ్రూట్ ను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాలను కూడా సులభంగా తగ్గించడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు:
డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ ఫ్రూట్స్లో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ సి  కూడా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఫ్రూట్ ను ప్రతిరోజు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:

1. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా తక్కువ మొత్తంలో కొవ్వు పరిమాణాలు ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీర బరువును తగ్గించి కూడా నియంత్రిస్తాయి. వీటి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. 

2. గుండె జబ్బులు దూరమవుతాయి:
గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి డ్రాగన్ ఫ్రూట్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ గుండె సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును కూడా సులభంగా నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
కరోనా వైరస్ కారణంగా చాలామంది రోగ నిరోధక శక్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి డ్రాగన్ ఫ్రూట్స్ తో తయారుచేసిన జ్యూస్ ను ప్రతిరోజు రెండు పూటలా తాగాల్సి ఉంటుంది. తాగడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి లభించి వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. 

Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  

Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More