Home> లైఫ్ స్టైల్
Advertisement

Diet Plan For Weight Gain: నెలకి 4 - 5 కిలోల బరువు పెరగాలంటే..ఈ 4 ఆహారాలు తీసుకోండి చాలు..

Diet Plan For Weight Gain: బరువు తగ్గడానికి ఎంత కష్టపడాలో బరువు పెరగడానికి కూడా అంతే కష్టపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు పెరగలేకపోతున్నారు. అయితే ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Diet Plan For Weight Gain: నెలకి 4 - 5 కిలోల బరువు పెరగాలంటే..ఈ 4 ఆహారాలు తీసుకోండి చాలు..

Diet Plan For Weight Gain: బరువు తగ్గడానికి ఎలాంటి డైట్‌లను వినియోగిస్తారో బరువు పెరగడానికి కూడా అలాంటి డైట్స్‌లనే వినియోగిస్తారు. కానీ తీసుకునే ఆహారంలో మాత్రం మార్పులుంటాయి. అయితే ప్రస్తుతం బరువు పెరగడానికి చాలా రకాల మార్గాలున్నాయి. అయితే క్రమం తప్పకుండా పోషకాలున్న ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్యాలరీలు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే బరువు పెరగడమేకాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు కూడా అతిగా తీసుకోవద్దు. ఒక వేళా తీసుకున్న తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యంగా సులభంగా బరువు పెరగడానికి తప్పకుండా ఈ కింద పెర్కొన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ ఆహారాలు బరువును పెంచుతాయి:

పనీర్:  
హెల్త్‌లైన్ నివేదికల ప్రకారం.. పాలు, పాలతో చేసిన ఉత్పత్తులు బరువును పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య నమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే బరువు పెరగడానికి ఆహారంలో పనీర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

గుడ్లు:
కండరాలను పెంచడానికి గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు పెరగచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

బటర్ రోటీ:
చాలా మంది రెస్టారెంట్స్‌లో ఎక్కువగా బిర్యానిలతో పాటు బటర్ రోటీలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే బరువు పెరగడానికి వీటిని తీసుకుంటే సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలపుతున్నారు. అంతేకాకుండా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

డ్రైఫ్రూట్స్ :  
డ్రైఫ్రూట్స్‌లో ఫ్రక్టోజ్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని బరువు పెరగడానికి వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. ఇవి శరీర బరువును పెంచడమేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా సులభంగా నియంత్రిస్తుంది. దీంతో మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..    

Also Read: YSRCP MLA Tears: కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. కష్టాలు తెలుసుకుని భావోద్వేగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More