Home> లైఫ్ స్టైల్
Advertisement

Constipation Relief Just 5 Minutes: అసిడిటీ, మలబద్ధకం సమస్యలకు కేవలం 5 నిమిషాల్లో చెక్ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసా..?

Home Remedies For Acidity And Constipation: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది తీవ్ర పొట్టలో సమస్యలతో బాధపడడం విశేషం. అయితే ప్రస్తుతం చాలా మంది ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు.

Constipation Relief Just 5 Minutes: అసిడిటీ, మలబద్ధకం సమస్యలకు కేవలం 5 నిమిషాల్లో చెక్ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసా..?

Home Remedies For Acidity And Constipation: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది తీవ్ర పొట్టలో సమస్యలతో బాధపడడం విశేషం. అయితే ప్రస్తుతం చాలా మంది ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతే.. కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యల కారణంగా చాలా మందిలో నిద్రలేక పోవడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టడానికి పలు రకాల నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో లభించే పలు రకాల వస్తువులతో ఈ పొట్ట సమస్యలను నియంత్రించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

అసిడిటీ, మలబద్ధకం కోసం ఇంటి నివారణలు:

అల్లం టీ:
అల్లంలో ఔషధ గుణాలకు చాలా ఉంటాయి. ఇది శరీరానికి వ్యాధి నిరోధక శక్తి ఇవ్వడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే ఎసిడిటీ, అపానవాయువు, వికారం లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే అల్లంతో చేసిన టీలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీని రోజుకు రెండు సార్లు తీసుకుంటే కేవలం 2 గంటల్లో గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది.  

పాలు, నెయ్యి:
మలబద్ధకం కోసం ఈ రెసిపీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.  పాలలో నెయ్యి కలిపి తాగితే మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా శరీరం దృఢంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పాలలో నెయ్యి కలిపి తాగాలని నిపుణులు తెలుపుతున్నారు.

నిమ్మరసం:
నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా నిమ్మలో కరిగే ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉంటుంది. దీని కారణంగా మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. అయితే పిల్లలు మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడితే తప్పకుండా నిమ్మరసం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

Also Read: Horoscope Today September 11th 2022: నేటి రాశి ఫలాలు... చంద్ర బలంతో ఈ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More