Home> లైఫ్ స్టైల్
Advertisement

Cholesterol Reducing Foods: చలికాలంలో కొలెస్ట్రాల్‌ను అంతమొందించే కూరగాయలు ఇవే..

Cholesterol Reducing Foods: చలికాలం శరీరానికి ఎంతో హాయిగా అనిపించినప్పటికీ.. అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చాలామందిలో గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి కొన్ని ఆహారాలు ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.

 Cholesterol Reducing Foods: చలికాలంలో కొలెస్ట్రాల్‌ను అంతమొందించే కూరగాయలు ఇవే..

 

Cholesterol Reducing Foods: శీతాకాలం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ శరీరంలోని అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా చలికాలంలో శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాల్లో మార్పులు రావడం కారణంగా గుండెపోటు మధుమేహం వంటి సమస్యల బారిన పడతారు. కాబట్టి శీతాకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొలెస్ట్రాల్ లేని ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం ఎంతో మంచిదని వారంటున్నారు. 

ముఖ్యంగా కాలంలో కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా బచ్చలి కూర వంటి అధిక పోషక గుణాలు కలిగిన కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్ అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా బచ్చలి కూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే గుండెపోటు ఇతర గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రతిరోజు బచ్చలి కూరను తీసుకోవాల్సి ఉంటుంది. 

అలాగే అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు శీతాకాలంలో ప్రతిరోజు చిలకడదుంపని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్ ను సులభంగా నియంత్రించి.. శీతాకాలంలో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా ఇందులో లభించే బీటా కెరోటీన్ కూడా శరీరంలోని గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. 

Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

క్రమం తప్పకుండా శీతాకాలంలో క్యాలీప్ల‌వ‌ర్ తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో లభించే ఫైబర్ పరిమాణాలు, బీటా కెరోటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా బ్రోకలీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More