Home> లైఫ్ స్టైల్
Advertisement

Black Garlic Benefits: నల్ల రంగు వెల్లుల్లి లాభాలు తెలిస్తే..ప్రతి రోజు తప్పకుండా తింటారు!

Black Garlic Benefits: నల్ల రంగు వెల్లుల్లిని ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

Black Garlic Benefits: నల్ల రంగు వెల్లుల్లి లాభాలు తెలిస్తే..ప్రతి రోజు తప్పకుండా తింటారు!

Black Garlic Benefits: వెల్లుల్లి లేని ఆహారాలు తినడానికి అంతగా రుచిగా ఉండవు. ఇది ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీరానికి కూడా బోలెడు లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల బాడీకి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీంలోని రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బాడీ ఉష్ణోగ్రతలను పెంచేందుకు కూడా సహాయపడతాయి. అయితే చాలా మంది తెల్ల వెల్లుల్లిలను చూసి ఉంటారు. కానీ ప్రస్తుతం చాలా చోట్ల నల్ల వెల్లుల్లి కూడా లభిస్తోంది. వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

నల్ల వెల్లుల్లి రుచి ఎలా ఉంటుంది?
నలుపు రంగులో కలిగిన వెల్లుల్లి అచ్చంగా తెల్ల వెల్లుల్లి సైజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది వీటిని పులియబెట్టుకుని తింటూ కూడా ఉంటారు. తెల్ల కలర్‌లో ఉండే వెల్లుల్లితో పోలిస్తే నల్ల వెల్లుల్లి తీపి రుచిని కలిగి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. 

గుండె ఆరోగ్యానికి మెరుగుపరుచుతుంది:
నల్ల వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సులభంగా తగ్గిస్తుంది. దీని కారణంగా రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

బరువును తగ్గిస్తుంది:
నల్ల వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ వంటి కొన్ని సమ్మేళనాలు జీవక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కేలరీలను బర్న్‌ చేస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా సులభంగా తగ్గిస్తాయి. 

క్యాన్సర్ నుంచి ఉపశమనం:
అధ్యయనాల ప్రకారం..నల్ల వెల్లుల్లిలో ఉండే గుణాలు క్యాన్సర్ కణాలను సులభంగా నియంత్రిస్తాయి. దీంతో పాటు ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More