Home> లైఫ్ స్టైల్
Advertisement

Children Growth: పిల్లలు వేగంగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..?

Children Growth Tips: పిల్లలు వేగంగా , ఆరోగ్యంగా ఎదగాలి అంటే వారి ఎముకల్లో కావలసినంత కాల్షియం ఉండాలి.. మరి కాల్షియం లభించే ఆహారాలను పిల్లలకు..తినిపించడం వల్ల వారి ఎముకలు బలంగా దృఢంగా మారి భవిష్యత్తులో ఎముకలకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా వుంటారు. 

Children Growth: పిల్లలు వేగంగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..?

Children's Growth: చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వారి శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభించాలి. అప్పుడే వారి ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల బాగుండాలి అంటే వారి ఎముకలు దృఢంగా పటిష్టంగా మారడమే కాదు వేగంగా ఎదగడానికి సహాయపడాలి. అయితే మరి మనం కూడా పిల్లల ఎముకల ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి..  లేకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి, వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడి.. ఎముకల సాంద్రత తగ్గుతుంది..  వయసు యొక్క క్షీణత ప్రభావం అస్తిపంజర వ్యవస్థ పై పడుతుంది అని వైద్యుల సైతం చెబుతున్నారు.. అందుకే చిన్నతనం నుంచే పిల్లల్లో దృఢమైన,  బలమైన ఎముకలను నిర్మించేందుకు తల్లిదండ్రులు పాటు పడాల్సి ఉంటుంది. 

మునగాకు..

ఇక పిల్లల్లో క్యాల్షియం పెంచడం తప్పనిసరి.. ఎముకల దృఢత్వానికి కాల్షియం ఎంతగానో సహాయపడుతుంది.. కాబట్టి కాల్షియం ఉండే ఆహారాలను పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల్లో ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా తయారవుతారు. క్యాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాల్లో మునగాకు కూడా ఒకటి.. ఇందులో లభించే కాల్షియం పిల్లల్లో ఎముకలు దృఢత్వానికి తోడ్పడుతుంది. కాబట్టి రెండుసార్లు వారానికి పిల్లల చేత మునగాకును తినిపించాలి.. లేదంటే మునగాకు పొడిని పాలలో కలిపి తాగించడం వల్ల కూడా శరీరానికి తగిన కాల్షియం లభిస్తుంది. 

నువ్వులు..

అలాగే పిల్లల్లో ఎముకలు బలంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తినేలా జాగ్రత్త పడాలి.. నువ్వులు తినలేకపోతే నువ్వుల లడ్డును వారికి ఇవ్వడం వల్ల ఎముకల బలానికి కావాల్సిన క్యాల్షియం లభిస్తుంది. ముఖ్యంగా నువ్వులలో ప్రోటీన్, విటమిన్, కాల్షియం అవసరమైన ఖనిజాలు లభిస్తాయి.  కాబట్టి ఎముకలు బలంగా తయారవుతాయి. 

పెరుగు..

పెరుగు కూడా క్యాల్షియం పెంచడంలో సహాయపడుతుంది.. ఒక కప్పు పెరుగు పిల్లల చేత తినిపించాలి.. ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా మార్చే విటమిన్ డి,  కాల్షియం పెరుగులో సహజంగా లభిస్తుంది..  కాబట్టి సాధ్యమైనంతవరకు రోజులో ఏదో ఒక సమయంలో ఒక కప్పు పెరుగు తినేలా వారిని మనం ప్రోత్సహించాలి. 

ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ..

వీటితోపాటు మెంతికూర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు కూడా పిల్లల ఆహారంలో భాగం చేయాలి. వారానికి ఒక్కసారైనా ఒక ఆకుకూర పిల్లలు తినేలా చూసుకోవాలి.. గింజలు కూడా పిల్లలకు ఇవ్వాలి. నిత్యం తినకపోతే వారంలో ఒక్కసారైనా పిల్లలు వీటిని తినేలా తల్లులు జాగ్రత్త పడాలి.. ఇలా చేస్తే పిల్లల ఎముకలు బలంగా మారి వేగంగా ఎదగడానికి సహాయపడతాయి.

Also Read: RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More