Home> లైఫ్ స్టైల్
Advertisement

Besan for glowing skin: శనగపిండితో మచ్చలేని ముఖం.. నిత్యయవ్వనం.. డ్రై స్కిన్‌ యాక్నేకు చెక్..

Besan for glowing skin: శనగ పిండిలో మన స్కిన్ కేర్ కి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇది ముఖాన్ని మెరిపిస్తుంది దీంతో ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటే ప్రముఖంపై ఉన్న డెడ్ సెల్స్  తొలగిపోతాయి

Besan for glowing skin: శనగపిండితో మచ్చలేని ముఖం.. నిత్యయవ్వనం.. డ్రై స్కిన్‌ యాక్నేకు చెక్..

Besan for glowing skin: శనగ పిండిలో మన స్కిన్ కేర్ కి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇది ముఖాన్ని మెరిపిస్తుంది దీంతో ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటే ప్రముఖంపై ఉన్న డెడ్ సెల్స్  తొలగిపోతాయి. మన అమ్మమ్మల కాలం నుంచి శనగపిండిని స్కిన్ కేర్ రొటీన్ లో ఉపయోగిస్తారు. ఇది అన్ని రకాల స్కిన్ వారికి ఉపయోగపడుతుంది. శనగపిండితో మనకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

టాన్ తొలగిస్తుంది..
ఎండకాలంలో ముఖం టాన్ పెరుగుతుంది. ఇది సూర్యరశ్మి వల్లే ఇలా జరుగుతుంది. శనగ పిండితో ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటే ఇది నాచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది. శనగపిండిని పాలతో కలిపి ముఖాన్ని సర్క్యూలర్ మోషన్లో స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇది ఆయిలీ స్కిన్ వారైతే శనగపిండి పెరుగు కలిపి ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి. దీంతో ముఖంపై పేరుకున్న ట్యాన్‌ తొలగించి మన ముఖానికి సహజసిద్ధంగా పునరజ్జీవనం అందిస్తుంది. ముఖం కాంతివంతంగా వెలిగిపోతుంది.

యాక్నే..
ముఖంపై అదనపు ఆయిల్ ఉత్పత్తిని శనగపిండి తగ్గిస్తుంది. ఎందుకంటే శనగపిండి కి ఆయిల్ గ్రహించే గుణం కలిగి ఉంది ఇది ముఖంపై యాక్నే రాకుండా కూడా నివారిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది చర్మాన్ని తాజాగా ఉంచడంలో శనగపిండి కీలక పాత్ర పోషిస్తుంది.

డ్రై స్కిన్ కు చెక్..
శనగపిండి మీరు స్కిన్ కేర్ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల డ్రై స్క్రీన్ సమస్య కూడా తొలగిపోతుంది. ఇది చర్మానికి తగిన పోషకాలు అందించి తాజాగా ఉండేలా చేస్తుంది. శనగపిండిలో ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు వేసుకొని ముఖానికి అప్లై చేయడం వల్ల మాయిశ్చర్ నిలుపుతుంది. చర్మం పొడిబారడం తగ్గిపోతుంది. ఇది ముఖాన్ని మృదువుగా మార్చడంలో పని చేస్తుంది.

ఇదీ చదవండి: ఇలా చేస్తే 3 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా.. పొడుగ్గా పెరుగుతుంది..

నేచురల్ ఎక్స్పాలియేటర్..
శనగపిండి ముఖానికి తరచుగా వాడటం వల్ల ఇది నేచురల్ గా ఎక్స్పోల్యేషన్ గుణాలు కలిగి ఉంటుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. నీ ముఖంపై ఎలాంటి కెమికల్స్ వాడకుండానే నాచురల్ గా శనగపిండితో స్క్రబ్ చేసుకుంటే అందంగా మృదువుగా తయారవుతుంది.

ఇదీ చదవండి: గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉండే ఈ 10 పండ్లు.. డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు..

వృద్ధాప్య ఛాయలు..
శనగపిండిని మీ స్కిన్ కేర్ రొటీన్ లో అప్లై చేసుకోవాలి ఆడ్ చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు, గీతాలు తొలగిపోతాయి ఇది త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్ సమస్యను తగ్గించేసి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. శనగపిండిని మీ స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకోవడం వల్ల మీ స్కిన్ నేచురల్ గా యవ్వనంగా కనిపిస్తుంది. శనగపిండిని ఉపయోగించే ముందు కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ముఖానికి మాయిశ్చర్ నిలిపి ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. డెడ్ స్కిన్ తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది వృద్ధాప్య ఛాయలు రాకుండా సహజసిద్ధంగా ముఖాన్ని మెరిపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More