Home> లైఫ్ స్టైల్
Advertisement

Beauty Tips: పసుపులో ఇదొక్కటి కలిపితే చాలు.. పార్లర్ కి బై బై..!

Turmeric Powder Benefits: పసుపులో కొద్దిగా శెనగపిండి,  పచ్చిపాలు లేదా పెరుగు లాంటివి కలుపుకొని.. ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం మరింత అందంగా తయారవుతుంది. అంతే కాదు పసుపు వల్ల.. మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి అవి ఏవో చూడమా..

Beauty Tips: పసుపులో ఇదొక్కటి కలిపితే చాలు.. పార్లర్ కి బై బై..!

Beauty Skin Tips: ఏ అమ్మాయికైనా సరే తమ ముఖం చాలా అందంగా కనిపించాలని ఆరాటపడుతూ ఉంటారు.. దానికోసం వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు.. అయితే ఎంత డబ్బు ఖర్చు చేసినా.. సరే ఆ ఫలితం కొంత వరకు మాత్రమే ఉంటుంది.  కానీ మంచి రిజల్ట్స్ వచ్చి అనారోగ్యానికి చర్మం గురి కాకుండా ఉండాలి అంటే.. కొన్ని రకాల ఇంట్లో దొరికే పదార్థాలతోనే ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.. మరి మీరు కూడా అందమైన ముఖాన్ని.. మొటిమలు మచ్చలు లేని ముఖాన్ని పొందాలి అనుకుంటే .. పసుపులో ఇది ఒక్కటి కలిపితే చాలు అని చెబుతున్నారు. మరి  ఆ చిట్కా ఏంటి..? ఎలా ఉపయోగించాలి..?  అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

పసుపు - శెనగపిండి:

పసుపు - శెనగపిండి కలిపి ముఖానికి రాయడం వల్ల మీ ముఖం మరింత మృదువుగా,  అందంగా తయారవుతుంది. 2 టేబుల్ స్పూన్ ల శెనగపిండి , ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు పూర్తిగా ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేశారంటే ముఖం పైన వచ్చే తేలికపాటి వెంట్రుకలతో పాటు మొటిమలు, మచ్చలు కూడా దూరం అవుతాయి.. అందమైన మృదువైన ముఖం మీ సొంతం అవుతుంది. 

ఇకపోతే శెనగపిండి విషయానికొస్తే.. ఇది ఒక స్క్రబ్బర్ లా పని చేస్తుంది. చర్మం పైన రంధ్రాలను ఓపెన్ చేసి.. అందులో ఉండే మలినాలను, దుమ్మును తొలగిస్తుంది. ఫలితంగా మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా చర్మంపై ఉండే అదనపు ఆయిల్,  వివిధ చర్మ శుద్ధి సమస్యలను కూడా వదిలించుకోవడానికి ఈ శెనగపిండి చాలా బాగా పనిచేస్తుంది.

పసుపు - పెరుగు - శెనగపిండి:

పసుపు , పెరుగు , శెనగపిండి..ఈ మూడు మిశ్రమాలు కూడా మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి.. అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు.. చిటికెడు పసుపు.. తేనె అన్నింటిని వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కాసేపు ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.. ఇలా చేస్తే ముఖం మరింత కాంతివంతంగా తయారవుతుంది. ఇక శెనగపిండి , పసుపులో పచ్చిపాలు కలిపి ముఖానికి అప్లై చేసినా  సరే ముఖం నిగనిగలలాడుతూ కాంతివంతంగా మారుతుంది.

Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!

Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More