Home> లైఫ్ స్టైల్
Advertisement

Ayurveda for hair: నల్ల మిరియాల మిశ్రమంతో కూడా ఈ జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

Ayurveda for hair: ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జుట్టులో చుడ్రు సమస్యలతో ఎక్కువ మంది బాధపడడం విశేషం. వాతావరణం మార్పుల వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని.. కాబట్టి జుట్టును సంరక్షించుకోవడం, శుభ్రపరచుకోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

Ayurveda for hair: నల్ల మిరియాల మిశ్రమంతో కూడా ఈ జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

Ayurveda for hair: ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జుట్టులో చుడ్రు సమస్యలతో ఎక్కువ మంది బాధపడడం విశేషం. వాతావరణం మార్పుల వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని.. కాబట్టి జుట్టును సంరక్షించుకోవడం, శుభ్రపరచుకోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. లేకపోతే వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయని వారు చెబుతున్నారు. అయితే చుండ్రు సమస్యలకు చెక్ పెట్టేందుకు మార్కెట్లో లభించే చాలా రకాల ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. కానీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం వంటల్లో వినియోగించే.. సుగంధ ద్రవ్యమైన నల్ల మిరియాలు కూడా ఉపయోగించి ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయితే నల్ల మిరియాలు వినియోగించి ఈ సమస్యకు ఎలా తగ్గించుకొవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు నుంచి చుండ్రుకు ఇలా చెక్ పెట్టండి..
చండ్రు సమస్యలను నియంత్రించడానికి.. మూడు చెంచాల నల్లమిరియాలు తీసుకొని వాటిలో నీటిని వేసి 20 నిమిషాల పాటు నాననివ్వండి. ఆ తర్వాత వాటిని మిశ్రమంగా చేసి తలకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన దాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత షాంపూ తో వెంట్రుకల నుంచి ఆ మిశ్రమాన్ని కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పెరుగును కలిపి తలకు పట్టిస్తే జుట్టునుంచి చుండ్రు సులభంగా పోతుంది.

నల్ల మిరియాలు, తేనె:
నల్ల మిరియాలు మిశ్రమంగా చేసి అందులో తేనెను వేసి కలిపి పేస్టులా చేసుకుని జుట్టుకు పట్టిస్తే జుట్టు సమస్యలతో పాటు చండ్రు సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి తలపై దురదను సులభంగా నియంత్రిస్తాయి.

నల్ల మిరియాలు, కొబ్బరినూనె:
చండ్రుని తగ్గించుకోవడానికి.. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని.. అందులో ఒక టీస్పూన్ నల్ల మిరియాల పొడిని వేసి కలిపి మిశ్రమంలో చేసి తలకు పట్టిస్తే సులభంగా చుండ్రు సమస్యకు చెప్పి పెట్టవచ్చు.

సులభంగా రక్షిస్తాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారాన్ని స్వీకరించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebo

Read More