Home> లైఫ్ స్టైల్
Advertisement

Cooking Tips: పచ్చని కూరగాయలను బాగా ఉడికించి తింటున్నారా? అయితే ఒక్కసారి ఇది చదవండి..

Vegetables Cooking Tips:  నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం పచ్చని ఆకుకూరలు లోని పోషకాలు పుష్కలంగా అందాలంటే అందులో అది వండే విధానంలోనే ఉంటుంది అయితే ఈ ఆకుకూరలు కూరగాయలు పచ్చ రంగులో ఉన్నవి ఉడికించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Cooking Tips: పచ్చని కూరగాయలను బాగా ఉడికించి తింటున్నారా? అయితే ఒక్కసారి ఇది చదవండి..

Vegetables Cooking Tips: మన శరీరానికి ఆకుకూరలు కూరగాయలు ఎంతో ముఖ్యం. పచ్చని ఆకుకూరల్లో అనేక ఔషధాలు ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకు పచ్చని ఆకుకూరలు అంటే ముందు వరసలో వచ్చేది పాలకూర , క్యాబేజీ ,బ్రోకోలికి పచ్చ కూరల జాబితాలో వస్తాయి. ఇవి మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే చాలామంది ఈ పచ్చని కూరగాయలు ఉడికించేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు దీని వల్ల అందులో ఉన్న పోషకాలు కానీ చాలు మన ఆరోగ్యానికి అందకుండా పోతాయి అవి ఏంటో తెలుసుకుందాం.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం పచ్చని ఆకుకూరలు లోని పోషకాలు పుష్కలంగా అందాలంటే అందులో అది వండే విధానంలోనే ఉంటుంది అయితే ఈ ఆకుకూరలు కూరగాయలు పచ్చ రంగులో ఉన్నవి ఉడికించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కొంతమంది కూరగాయల్ని నూనెలో ఉడికిస్తే అందులో పోషకాలు కోల్పోతామని అపోహలో ఉంటారు. కానీ నూనెలో ఉడికించిన కూరగాయలతోనే ఖనిజాలు పుష్కలంగా మన శరీరానికి అందుతాయి, మన శరీరం త్వరగా గ్రహిస్తుంది. అందుకే పచ్చ కూరగాయలను ఎప్పుడూ నూనె లేదా నెయ్యిలో వేసి ఉడికించుకోవాలి.

కొంతమంది ఈ ఆకుకూరలు, కూరగాయలు ఉడికించేటప్పుడు అతిగా ఉడికించేసి పెడతారు ఇలా చేయడం వల్ల అందులోని పోషకాలను కోల్పోతాం .ఎక్కువ సమయం పాటు ఉడికించుకోవచ్చు తక్కువ మంట మీద ఉడికించాలి అందుకే చాలామంది చేఫ్ లు ఈ కూరగాయలు ఉడికించేటప్పుడు వేడి నీటిలో వేస్తారు ఇలా చేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది.

ఇదీ చదవండి: తెల్ల వెంట్రుకలను శాశ్వతంగా నల్లగా మార్చే పెప్పర్ హెయిర్ డై ఇలా సింపుల్ గా చేసుకోండి..

అంతేకాదు ఎక్కువగా కూరగాయలపై సీజనింగ్ చేస్తే రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా మిర్యాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, రాళ్ల ఉప్పు, ఆలివ్ ఆయిల్ వేయటం వల్ల వాటి రుచి మరింత పెరుగుతుంది. 

ఉడికించేటప్పుడు నీళ్లు పోయడం తప్పనిసరి ఇలా చేయడం వల్ల పోషకాలు ఖనిజాలు అందులోనే ఉంటాయి. అందుకే ఏ కూరగాయలు ఉడికించిన అందులో నీళ్లు పోసి వాడుకోవడం ఎంతో ముఖ్యం.

కూరగాయలను వేయించుకొని తినే పద్ధతిని మానుకోవాలి ఎందుకంటే నీళ్లు పోసి ఉడికించి వాటిలోనే ప్రోటీన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇలా వేయించటం వల్ల న్యూట్రియన్స్ ఖనిజాలు పూర్తిగా కోల్పోతారు.

ఇదీ చదవండి: మీ ఫ్రెండ్స్ తో ఒక్కసారైనా రోడ్ ట్రిప్ వెళ్లాల్సిన టాప్ 7 రోడ్డు మార్గాలు ఇవే..

కూరగాయల పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉండాలంటే ఏ ఆకుకూరలు వంటివి కట్ చేసిన కానీ ఆ పెద్ద మొత్తంలో కట్ చేయాలి అంటే చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల అందులో ఉన్న ఖనిజాలను కోల్పోతాం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More