Home> లైఫ్ స్టైల్
Advertisement

Lotus Seeds Benefits: ఫూల్ మ‌ఖానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Lotus Seeds Uses: తామర గింజలు వేయించి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిని మార్కెట్‌లో ఫూల్‌ మఖానా అని అమ్ముతారు. ఇవి చూడడానికి తెల్లగా, గుండ్రంగా ఉంటాయి. ఫూల్ మ‌ఖానా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి అందే పోష‌కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
 

Lotus Seeds Benefits: ఫూల్ మ‌ఖానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Lotus Seeds Uses: ఫూల్ మ‌ఖానా తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఫూల్ మఖానాతో చిరుతిళ్లు, కూరలను తయారు చేస్తుంటారు. ఇందులో ప్రోటీన్,ఫైబ‌ర్ శాతం అధికంగా లభిస్తుంది. అధిక బరువుతో ఉన్నవారు ఆకలి ఎక్కువగా ఉంటే ఈ మఖానా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.

ఫూల్‌ మఖానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల సులభంగా బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీని వల్ల నరాల పనితీరు మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఫూల్‌ మఖానాలో  మెగ్నీషియం ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 

ఎముకల‌ను, దంతాల‌ను ధృడంగా ఉంచ‌డంలో కూడా ఫూల్ మ‌ఖానా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ప్రతిరోజు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, వాపులు వంటివి త‌గ్గుతాయి. 

గుండె పనితీరును మెరుగుపరచడంలో ఫూల్‌ మఖానా ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని మెగ్నిషియం, గల్లిక్ యాసిడ్స్‌ గుండెపోటు వంటి వ్యాధులను తగ్గిస్తుంది.

Also read: Weight loss Diet: రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం

రక్తహీనత సమస్యను దూరం చేయడంలో ఫూల్‌ మఖానా సహాయపడుతుంది.

కీడ్నీల్లోని ఆక్సిడేటీవ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. రాళ్లు ఏర్పడకుండా ఫూల్‌ మఖానా కాపాడతాయి.

ఈ విధంగా ఫూల్ మ‌ఖానా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Also read: Best Face Packs: మీ అందం కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేసే టిప్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More