Home> లైఫ్ స్టైల్
Advertisement

AC Cooling Problem: సమ్మర్ లో ఏసీ కూలింగ్ పెరగాలంటే ఈ చిట్కాలు కచ్చితంగా పాటించండి!

AC Cooling Problem: రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు తీవ్ర ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో మనలో చాలామంది ఇంటికే పరిమితమయ్యి.. కూలర్లు, ఏసీల కింద కూర్చొని పనులు చేసుకునేందుకు అలవాటు పడ్డారు. ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏసీ కూలింగ్ తగ్గుతుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ కూలింగ్ పెంచుకునేందుకు ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 

AC Cooling Problem: సమ్మర్ లో ఏసీ కూలింగ్ పెరగాలంటే ఈ చిట్కాలు కచ్చితంగా పాటించండి!

AC Cooling Problem: ప్రజలందరూ ప్రస్తుతం మండుతున్న ఎండలు, వేడిమి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రతి ఇంట్లో ఏసీలు, కూలర్లను తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఎండల ధాటిని తట్టుకోవడానికి ఏసీలకు బానిసలుగా మారుతున్నారు. అయితే ఈ వేసవిలో ఏసీ నుంచి చల్లదనం పెరగాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. 

AC ఆన్ చేసే ముందు ఈ పని చేయండి!

మీరు మీ ఇంట్లో ఏసీని ఆన్ చేసే ముందుగా దానిని సర్వీసింగ్ చేయడం మర్చిపోవద్దు. మీ AC ఫిల్టర్ శుభ్రపరచండి. చల్లదనం కోసం ప్రతి రెండు వారాలకు ఒకసారి AC ఫిల్టర్ ను శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్ వెంట్స్‌లో దుమ్ము పేరుకుపోకుండా శుభ్రపరచడం వెనుక ఉన్న కారణం ఇదే. ఫిల్టర్ వెంట్ ను క్లీన్ చేసిన తర్వాత ఏసీ నుంచి కూలింగ్ పెరగడం మీరు గమనిస్తారు. 

సూర్యకాంతి పడకుండా..

దీంతో పాటు మీరు ఇంట్లో ఏసీని ఇన్ స్టల్ చేసే ముందు.. దాని అవుట్ డోర్ యూనిట్ పై ఎక్కువగా సూర్యకాంతి పడకుండా జాగ్రత్త పడాలి. దీని వల్ల గదిలో కూలింగ్ పై ఇది ప్రభావం చూపుతుంది. అందుకే మీ ACకి సంబంధించిన అవుట్‌డోర్ యూనిట్ షెడ్‌ కింద ఉండేలా లేదా నీడ ప్రదేశంలో ఉండేలా జాగ్రత్త వహించాలి. 

ఈ రెండు సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీ AC నుంచి కూలింగ్ ను మెరుగుపరచుకోవచ్చు. అందుకు కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు.  

Also Read: Drinking Water After Food: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొచ్చా? నిపుణులు ఏం అంటున్నారో తెలుసా?

Also Read: Find My Device: దొంగిలించిన స్మార్ట్ ఫోన్ ను ట్రాక్ చేయడం ఎలానో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More