Home> జాతీయం
Advertisement

Yaas Cyclone Update: యాస్ తుపాను ప్రభావంతో..మరో మూడ్రోజులపాటు వర్షాలు

Yaas Cyclone Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికాస్సేపట్లో వాయుగుండంగా..రేపటికి తుపానుగా మారనుంది. వచ్చే 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపధ్యంలో తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.

Yaas Cyclone Update: యాస్ తుపాను ప్రభావంతో..మరో మూడ్రోజులపాటు వర్షాలు

Yaas Cyclone Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికాస్సేపట్లో వాయుగుండంగా..రేపటికి తుపానుగా మారనుంది. వచ్చే 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపధ్యంలో తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను (Tauktae Cyclone) విధ్వంసం తరువాత ఇప్పుడు బంగాళాఖాతంలో(Bay of Bengal) యాస్ తుపాను బీభత్సం సృష్టించనుందని తెలుస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతున్న యాస్ తుపాను..రానున్న 6 గంటలలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి రేపటికి తుపానుగా మారనుంది. వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడి..అతి తీవ్ర తుపానుగా మారనుందని ఐఎండీ (IMD) తెలిపింది. ఆ తరువాత ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణిస్తూ..26వ తేదీ సాయంత్రానికి పశ్చిమ బెంగాల్-ఒడిశా-బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశాలున్నాయి.

యాస్ తుపాను(Yaas Cyclone) కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పరిమితమైన ప్రభావం ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు( Moderate Rains) పడే అవకాశాలున్నాయి. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక దక్షిణ కోస్తాంధ్రలో కూడా మోస్తరు వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో సైతం ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది. మొత్తానికి యాస్ తుపాను ప్రభావంతో రానున్న ముూడ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.

Also read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సమస్యకు 8వ వేతన సంఘం చెక్ పెడుతుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More