Home> జాతీయం
Advertisement

ప్రియుడితో లేడీ కానిస్టేబుల్ క్వారంటైన్.. షాకింగ్ ట్విస్ట్

Nagpur Lady Constable | వామ్మో.. ఆ మహిళా కానిస్టేబుల్ తెలివి చూస్తే సినిమా సీన్‌లు కళ్లముందు కదులుతాయి. క్వారంటైన్ కేంద్రానికి ఏకంగా ప్రియుడితో వెళ్లి ఏకాంతంగా గడిపి అడ్డంగా బుక్కయింది. విషయం తెలిసి అధికారులు నాలుక్కరుచుకున్నారు.

ప్రియుడితో లేడీ కానిస్టేబుల్ క్వారంటైన్.. షాకింగ్ ట్విస్ట్

కరోనా మహమ్మారి ఏదో విధంగా ప్రజల జీవితాలను తలకిందులు చేస్తోంది. ఓవైపు ఆర్థికంగా సమస్యలు తెస్తుంటే, మరోవైపు అక్రమ సంబంధాలకు సైతం వైరస్‌ను వాడుకుంటున్నారు. అలాంటి ఓ ఘటన తాజాగా మహారాష్ట్రలో వెలుగుచూసింది. కొన్ని రోజుల కిందట నాగ్‌పూర్‌కు చెందిన ఓ పోలీసు అధికారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న మరికొందరు పోలీసులు, వారితో నేరుగా టచ్‌లో ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కరోనా పాజిటివ్

ఓ మహిళా కానిస్టేబుల్ (Nagpur Lady Constable) తన ప్రియుడిని భర్త అని డిపార్ట్‌మెంట్‌కు పరిచయం చేసింది. భార్యాభర్తలే కదా అని వీరికి క్వారంటైన్ కేంద్రంలో ఒకేగది (Lady Constable Quarantine With Lover)ని కేటాయించగా.. వారి విచ్చలవిడితనానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. గత మూడు రోజులుగా తన భర్త కనిపించడం లేదంటూ అతడి భార్య ఫిర్యాదు చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. అసలు ఆ మహిళా కానిస్టేబుల్‌కు వివాహమే కాలేదు. ఆమె అవివాహితురాలని తెలిసి డిపార్ట్‌మెంట్ సిబ్బంది కంగుతిన్నారు. బంగారం ధర పెరిగింది, వెండి తగ్గింది

నాగ్‌పూర్ పట్టణంలో ఆమె మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వ ప్రాజెక్టు పనిలో భాగంగా పోస్టల్ ఉద్యోగితో ఆమె పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఓ నాగ్‌పూర్ పోలీసు అధికారికి కరోనా సోకగా ఆయనను నేరుగా కలిసిన వారిని, వారితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ల వివరాలు సేకరించారు. సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

తన భర్త అంటూ పోస్టల్ ఉద్యోగి వివరాలను డిపార్ట్‌మెంట్‌కు ఇచ్చింది. దీంతో వారు భార్యాభర్తలుగా భావించి క్వారంటైన్ కేంద్రానికి తరలించి ఒకేగది కేటాయించారు. అయితే తన భర్త కనిపించడం లేదంటూ బజాజ్ నగర్ పోలీసులను ఆశ్రయించిన పోస్టల్ ఉద్యోగి భార్యకు ఎలాగోలా ఈ విషయం తెలిసింది. ఆపై నాగ్‌పూర్ సిటీ పోలీస్ కమిషనర్‌ను కలిసి జరిగిన విషయాన్ని చెప్పి విచారణ చేపట్టాలని కోరింది. ఆయన విచారనకు ఆదేశించారు. లేడీ కానిస్టేబుల్, పోస్టల్ ఉద్యోగితో క్వారంటైన్ కేంద్రంలో కలిసి ఉన్నట్లు తేలింది. ఆ పోస్టల్ ఉద్యోగిని హుటాహుటిన మరో క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు సమాచారం. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Read More