Home> జాతీయం
Advertisement

కేంద్రంతో కలిసి పని చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్

దేశ రాజధాని, ఢిల్లీ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్ల పాటు కేంద్రంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన తరవాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. 

కేంద్రంతో కలిసి పని చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని, ఢిల్లీ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్ల పాటు కేంద్రంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన తరవాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయనతో ఇది మొదటి సమావేశమని, దేశ రాజధాని ఢిల్లీ కోసం వచ్చే ఐదేళ్లపాటు కలిసి పనిచేయాలనే అంశమే ప్రధానంగా చర్చకు వచ్చిందని సమావేశానంతరం ఆయన విలేకరులతో అన్నారు.

ఢిల్లీని ప్రపంచంలోని ఉత్తమ నగరంగా తీర్చిదిద్దాలని, దీనికి మౌలిక సదుపాయాలను కల్పించాలని,కేంద్రాన్ని కోరామని ఆయన తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లపై అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అల్లర్లలో నష్టపోయిన కుటుంబాలకు తమ ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రాన్ని సహాయం కోరుతోందని, హింసలో ఇళ్ళు కాలిపోయి, దెబ్బతిన్న ఇళ్లకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయం చేస్తుందనే నమ్మకం తమకుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఉపశమనం, పునరావాసం కల్పించే పనిలో ఉందని,  అధికారుల నుండి క్రమం తప్పకుండా సమాచారం తీసుకుంటున్నామన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More