Home> జాతీయం
Advertisement

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇవాళ క్లారిటీ

Karnataka:కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. అధికార పీఠం మారనుందనే వార్తలపై ఇవాళ స్పష్టత రానుంది. కర్ణాటక వ్యవహారంలో బీజేపీ అధిష్టానం వైఖరేంటనేది తేలనుంది.

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇవాళ క్లారిటీ

Karnataka:కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. అధికార పీఠం మారనుందనే వార్తలపై ఇవాళ స్పష్టత రానుంది. కర్ణాటక వ్యవహారంలో బీజేపీ అధిష్టానం వైఖరేంటనేది తేలనుంది.

కర్ణాటక బీజేపీలో మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి.కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి మారనున్నారంటూ గత కొద్దికాలంగా వస్తున్న వార్తలపై ఇవాళ స్పష్టత రానుంది. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశం వెనుక కారణం కూడా ఇదేనంటూ వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

రాష్ట్రంలో యడ్యూరప్ప నాయకత్వం మార్పు తధ్యమనే ఊహాగానాలు బలంగా ఉన్న తరుణంలో యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన రాజకీయ భవితవ్యంపై బీజేపీ(BJP) హైకమాండ్ నుంచి ఇవాళ సాయంత్రం మెస్సేజ్ రావచ్చని..అది అందగానే మీడియాకు తెలియజేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప(Yediyurappa)తెలిపారు. పార్టీ హైకమాండ్ ఏది నిర్ణయించినా కట్టుబడి ఉంటానన్నారు. రాష్ట్రంలో వరదలు తీవ్రంగా ఉన్నందున తన రాజీనామా విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవచ్చని కూడా యడ్యూరప్ప చెబుతున్నారు. 

Also read: India Corona Vaccination: ఇండియాలో 42 కోట్లు దాటిన వ్యాక్సినేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More