Home> జాతీయం
Advertisement

Balakot Strike: పాక్‌కు బాగా బుద్ధి చెప్పాం: బాలాకోట్ దాడిపై ఐఏఎఫ్ చీఫ్ బదౌరియా

జమ్మూకాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడికి భారత వాయుసేన తగిన రీతిలో బుద్ధి చెప్పిందని బాలాకోట్ దాడులపై ఐఏఎఫ్ చీఫ్ బదౌరియా వ్యాఖ్యానించారు.

Balakot Strike: పాక్‌కు బాగా బుద్ధి చెప్పాం: బాలాకోట్ దాడిపై ఐఏఎఫ్ చీఫ్ బదౌరియా

న్యూఢిల్లీ: బాల్‌కోట్‌లో భారత వాయు సేన దాడులు జరిపి నేటిక ఏడాది పూర్తయింది. గతేడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రవాదుల ఘాతుకానికి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు కావడంతో భారత్ తమ వాయుసేన సత్తాను చాటుతూ చేసిన దాడులు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్. ఆ దాడులు జరిపి పూర్తి చేసుకున్న సందర్భంగా భారత వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భాదౌరియా బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రదాడులకు ఎలా స్పందించాలో అలా బుద్ధిచెప్పామన్నారు. భారత్ జోలికొస్తే ఊరుకునేది లేదని బాలాకోట్ దాడులతో పాకిస్థాన్‌కు తెలిసొచ్చేలా చేశామని పేర్కొన్నారు.

Also Read: తల్లా.. పెళ్లామా.. తేల్చుకోవాలంటున్న అనసూయ

మిరాజ్ 2000, మిగ్ 21ఎస్‌లు, సుఖోయ్ 30ఎంకేఐ యుద్ధవిమానాలతో పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ (JeM) ఉగ్రస్థావరాలపై రాత్రికి రాత్రే మెరుపు దాడులు చేయగా 300కు పైగా ఉగ్రవాదులను హతమైనట్లు కథనాలు వచ్చాయి. బాలాకోట్ ఘటనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఐఏఎఫ్ జవాన్లతో కొంత సమయం గడపడంతో పాటు మిషన్ నిర్వహించాలనుకుంటున్నట్లు బదౌరియా తెలిపారు. బాలాకోట్ దాడులు జరిగిన మరుసటిరోజు ఐఏఫ్ మిగ్-21 వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ పాక్ ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను నేలకూల్చారు.

Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్

అభినందన్ ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. అతడి తెగువ పట్ల ఐఏఎఫ్ గర్వంగా ఉందని, మరోవైపు పాకిస్థాన్ యుద్ధ విమానాలు నాశనం కావడం వారికి పెద్ద దెబ్బ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలు గేమ్ ఛేంజర్ అవుతాయని, భారత అమ్ములపొదిలో రాఫెల్ చేరితే ఐఏఎఫ్‌కు తిరుగుండదని భారత వాయుసేన చీఫ్ బదౌరియా వివరించారు.

See photos: భీష్మ సక్సెస్ మీట్‌లో రష్మిక మెరుపులు

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More