Home> జాతీయం
Advertisement

Free Ration Scheme: రేషన్ కార్డుదారులకు ముఖ్యగమనిక.. మరోసారి కీలక మార్పులు

Ration Card Online: రేషన్ పంపిణీలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక మార్పులు చేశాయి. ఉచిత రేషన్ పథకం కింద గోధుమల పంపిణీ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా గోధుమల కొరత కారణంగా.. గోధుమల స్థానంలో బియ్యం పంపిణీ చేయనున్నాయి.
 

Free Ration Scheme: రేషన్ కార్డుదారులకు ముఖ్యగమనిక.. మరోసారి కీలక మార్పులు

Ration Card Online: రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. రేషన్ నిబంధనలు మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల రేషన్ కార్డ్ హోల్డర్లపై ప్రభావం చూపించనుంది. ఉచిత రేషన్ పథకం కింద గోధుమల పంపిణీ నిలిపివేయాలని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి.

ప్రస్తుతం గోధుమల కొరత ఉండంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రేషన్ కార్డుదారులకు గోధుమలకు బదులు బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. లబ్ధిదారుదులు సహకరించాలని కోరుతున్నాయి.  

అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రేషన్‌కార్డుదారులకు గతంలో కంటే గోధుమలు తక్కువగా ఇచ్చి వాటి స్థానంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అర్హులైన రేషన్ కార్డుదారులకు గోధుమలు, బియ్యం ఉచితంగా పంపిణీ జరుగుతోంది. అయితే దేశంలో గోధుమల కొరత కారణంగా గోధుమ పంపిణీ నిలిపివేయక తప్పడం లేదు. 

ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్ రాష్ట్రాల్లోని రేషన్ కార్డుదారులకు గోధుమల పంపిణీ నిలిచిపోనుంది. ఉత్తరాఖండ్, గుజరాత్, జార్ఖండ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు గతంలో కంటే తక్కువ గోధుమలు అందజేయనున్నారు. ఈ రాష్ట్రాల మినహా ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం తర్వాత దాదాపు 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అధికంగా పంపిణీ చేయనున్నారు.

మరోవైపు దాదాపు 10 లక్షల మంది ప్రజలు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. ఆ రేషన్ కార్డులు రద్దు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం.. త్వరలోనే వారికి రేషన్ నిలిపివేయనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ సౌకర్యాన్ని పొందుతున్నారు. 

ఆదాయపు పన్ను చెల్లించే వారితో పాటు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి రేషన్ నిలిపి వేయనుంది కేంద్ర ప్రభుత్వం. వారిని అర్హుల జాబితా నుంచి తొలగించనుంది. ఉచిత రేషన్‌తో వ్యాపారం చేసేవారిని కూడా గుర్తించిన ప్రభుత్వం కఠిన చర్యలు సిద్ధమవుతోంది. నాలుగు నెలలపాటు రేషన్ తీసుకోని వారి కార్డులు కూడా రద్దు చేయనుంది. 

Also Read: Salman Pooja Dating: సల్మాన్‌ ఖాన్‌తో పూజా హెగ్డే ప్రేమాయణం.. ఇదేక్కడి లింక్ రా బాబు.. ట్వీట్ వైరల్  

Also Read: Himachal Pradesh Election Result: హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తిప్పలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo

Read More