Home> జాతీయం
Advertisement

Lockdown extended: జూన్‌ 10 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సీఎం

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేయాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే తమ ముందున్న ఏకైక పరిష్కారం అని భావిస్తున్న ప్రభుత్వాలు.. కేంద్రం నుంచి లాక్ డౌన్ కొనసాగింపు విషయంలో ఇంకా ఓ స్పష్టత రాకముందే తామే సొంత నిర్ణయం తీసుకుంటున్నాయి.

Lockdown extended: జూన్‌ 10 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సీఎం

కోల్‌కతా: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేయాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే తమ ముందున్న ఏకైక పరిష్కారం అని భావిస్తున్న ప్రభుత్వాలు.. కేంద్రం నుంచి లాక్ డౌన్ కొనసాగింపు విషయంలో ఇంకా ఓ స్పష్టత రాకముందే తామే సొంత నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఒడిషా, రాజస్తాన్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్ డౌన్ పాటించాల్సిందిగా ఆదేశాలు వెలువడగా.. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ట్రాలు వచ్చిచేరాయి. 

Also read : ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్.. డౌట్స్ క్లియర్ చేసిన సీఎం కేసీఆర్

పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనావైరస్ నివారణ కోసం  రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించిన మమతా బెనర్జి.. జూన్ 10 వరకు ఆ రాష్ట్రం పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు , కాలేజీలు, యూనివర్శిటీలు వంటి విద్యా సంస్థలను మూసివేసే ఉంచాల్సిందిగా స్పష్టంచేశారు. కరోనాపై యుద్ధంలో రానున్న రెండు రోజు వారాలు ఎంతో కీలకమైనవి అని మమతా బెనర్జీ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More