Home> జాతీయం
Advertisement

West Bengal Election: బెంగాల్‌‌లో 8 దశల్లో ఎన్నికలు జరపడంపై మమతా బెనర్జీ ఆగ్రహం

West Bengal Election: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఏకంగా 8 దశల్లో జరగనున్నాయి. ఇదే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహానికి కారణమైంది. దీని వెనుక మోదీ ఉన్నారా..అమిత్ షా ఉన్నారా అని దీదీ మండిపడ్డారు.

West Bengal Election: బెంగాల్‌‌లో 8 దశల్లో ఎన్నికలు జరపడంపై మమతా బెనర్జీ ఆగ్రహం

West Bengal Election: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఏకంగా 8 దశల్లో జరగనున్నాయి. ఇదే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహానికి కారణమైంది. దీని వెనుక మోదీ ఉన్నారా..అమిత్ షా ఉన్నారా అని దీదీ మండిపడ్డారు.

ఊహించినట్టే దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ( Five state assembly elections schedule) త్వరగా విడుదలైంది. తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 29 వరకూ జరగనున్నాయి. 294 నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్‌ ( West Bengal )లో మాత్రం ఏకంగా 8 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Cm mamata Banerjee) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడలో భాగంగానే 8 విడతల్లో ఎన్నికల నిర్వహణ అంటూ ధ్వజమెత్తారు.  మిగిలిన రాష్ట్రాల్లో ఒక విడతలో నిర్వహిస్తూ..బెంగాల్‌లో 9 విడతల్లో ఎందుకుని ప్రశ్నించారు. 

బీజేపీ ( Bjp) వర్గాల నుంచి తనకు సమాచారం అందిందని.. వారి సలహాలకు అనుగుణంగానే ఈ తేదీలు ఖరారు చేసినట్లు కనిపిస్తోందని తెలిపారు. ఒక జిల్లాలోని సగం నియోజకవర్గాలకే ఒక దశలో ఎన్నికలు నిర్వహించడం ఏ మేరకు సమంజసమని దుయ్యబట్టారు. ఇదంతా ప్రధాని మోదీ( Pm modi) ఐడియానా లేదంటే అమిత్‌ షా ( Amit shah) చెప్పారా అని అడిగారు. అసోంలో ప్రచారం ముగిసిన అనంతరం తాపీగా బెంగాల్‌లో ప్రచారం చేసుకునేందుకే ఈ ఎత్తుగడ వేసినట్టుందని చెప్పారు.  ఈ సారి ఆటలో మరోసారి చిత్తుగా ఓడించి.. దెబ్బకు దెయ్యం వదిలిస్తానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తాను బెంగాల్ పుత్రికని..బీజేపీ కంటే తనకే ఈ రాష్ట్రం గురించి ఎక్కువగా తెలుసని అన్నారు. ఎనిమిది విడతల్లో అయినా గెలుపు తమదేనన్నారు దీదీ.

2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ( Tmc) 211 స్థానాల్ని గెల్చుకోగా, వామపక్షాలు 79 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. అటు బీజేపీ మాత్రం కేవలం మూడు స్థానాల్లో గెలుపొందింది. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకుని 18 ఎంపీ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఈసారి అదే ఉత్సాహంతో బెంగాల్ కోటపై పాగా వేయాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది.  

Also read: AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More