Home> జాతీయం
Advertisement

Covid vaccination: మాకు అప్పగిస్తే మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్

Covid vaccination: ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వ్యాక్సిన్ సరఫరా, వ్యాక్సినేషన్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
 

Covid vaccination: మాకు అప్పగిస్తే మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్

Covid vaccination: ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వ్యాక్సిన్ సరఫరా, వ్యాక్సినేషన్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాక్సినేషన్(Corona vaccination)‌కు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అందరికీ అందించేందుకు కేంద్రం అనుమతించాలని కోరారు. వ్యాక్సిన్ సరఫరా తమకు అప్పగిస్తే..మూడు నెలల్లో ఢిల్లీలో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో కరోనా వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో రోజుకు 30-40 వేలమందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని..త్వరలో 1.25 లక్షలకు పెంచుతామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కేసులకు దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ డ్రైవ్ విస్తరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగినందున వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియను కూడా విస్తరించాలన్నారు. రాష్ట్రాలకు తమదైన పద్ధతిలో వ్యాక్సిన్ అందించేందుకు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind kejriwal) కోరారు. అర్హుల జాబితా కాకుండా అందరికీ వర్తింపజేయాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రక్రియ గానీ, మార్గదర్శకాలు గానీ చాలా కఠినంగా ఉన్నాయన్నారు. ఈ విధానాన్ని సరళీకరించి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పటికే రెండు నెలల అనుభవం అందరికీ వచ్చిందన్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తామన్నారు. దేశంలో గత 24 గంటల్లో 35 వేల 871 కొత్త కేసులు నమోదయ్యాయి. డిల్లీలో 5 వందలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 

Also read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More