Home> జాతీయం
Advertisement

Attack on CM: సీఎం భద్రతలో లోపం.. దాడికి యత్నించిన యువకుడు!

Attack on CM Nitish: బిహార్ ముఖ్యమంత్రిపై ఓ వ్యక్తి దాడి చేయబోయాడు. సెక్యురిటీని దాడుకుని వచ్చి దాడి చేయబోయినట్లు తెలిసింది. వీవీఐపీల భద్రత విషయంలోనే ఇలాంటి లోపాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Attack on CM: సీఎం భద్రతలో లోపం.. దాడికి యత్నించిన యువకుడు!

Attack on CM Nitish: మరోసారి వీవీఐపీల భద్రతలో లోపం బయటడింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​పై ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆ యువకుడి దాడితే అప్రమత్తమైన.. సీఎం వ్యక్తిగత భద్రత సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏమైదంటే..

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్.. పట్నా జిల్లా బక్తియాపూర్​లో ఓ పబ్లిక్ మీటింగ్​కు హాజరయ్యేందుకు వెళ్లారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న.. ఆయనపై ఓ వ్యక్తి సెక్యురిటీని దాడుకుని వచ్చి.. నితీశ్​ కుమార్​పై దాడి చేయబోయాడు. ఆయనపై చేయివేసి.. పక్కకు లాగబోయాడు. అయితే వెంటనే సెక్యురిటీ ఆ వ్యక్తిని పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు.

ఆ తర్వాత ఆ వ్యక్తిని స్థానిక పోలిస్​ స్టేషన్​కు తరలిచి.. విచారిస్తున్నారు. ఆ వ్యక్తి ఎందుకు దాడి చేశాడు? అందులో ఏదైనా కుట్రకోణం ఉందా? అనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మాత్రం వెల్లడించలేదు.

అయితే సీఎం నితీశ్​ కుమార్​పై దాడికి సంబంధించిన వీడియోను.. రాజకీయ విశ్లేషకులు తెహసీన్​ పూనావాలా ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఇది క్షమించరాని భద్రతా లోపం అని రాసుకొచ్చారు. సీఎం వ్యక్తిగత భద్రత సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర డీజీపీ స్వయంగా ఈ విషయంపై విచారణ జరపాలని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇక వీవీఐపీల భద్రతలో లోపం తలెత్తడే ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు పంజాబ్​లో ప్రధాని నరేంద్ర మోదీని పంజాబ్​లో కొంతమంది నిరసనకారులు అడ్డగించిన విషయం తెలిసిందే. ఇక అదే పంజాబ్​లో రాహుల్ గాంధీపై జెండా విసిరిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో వరుసగా వీవీఐపీల భద్రతలో లోపాలు బయటపడుతుండటం పట్ల.. ఆదోళన వ్యక్తమవుతోంది.

Also read: Shiva Lingam: కోర్టుకు హాజరైన శివ లింగం.. నెట్టింట్లో వైరల్

Also read: PMGKAY extended: ప్రధాన మంత్రి అన్న యోజన పథకం గడువు పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More