Home> జాతీయం
Advertisement

Singer SP Balu మా ఊరి వ్యక్తి.. టచ్‌లో ఉన్నాను, కానీ: వెంకయ్య నాయుడు భావోద్వేగం

మా ఊరి వ్యక్తి, లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam Death) నేడు భౌతికంగా దూరం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు.

Singer SP Balu మా ఊరి వ్యక్తి.. టచ్‌లో ఉన్నాను, కానీ: వెంకయ్య నాయుడు భావోద్వేగం

పాటల రారాజు, గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam Passes Away) కన్నుమూశారని తెలిసిందే. తన గాత్రంతో దశాబ్దాల పాటు కొన్ని తరాలను అలరించిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేడు భౌతికంగా దూరం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కోలుకున్నారని తెలిసి కొన్ని రోజుల కిందట ఓకింత ఊరట. కానీ ఆయన పూర్తిగా కోలుకోవడం లేదని, డాక్టర్లు చెబుతుంటే తల్లడిల్లిపోయాం. కానీ చివరికి ఏ ప్రయత్నాలు ఫలించకపోవడంతో సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1.04 గంటలకు బాలు తుదిశ్వాస విడిచారు. SP Balasubrahmanyam died: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు

ఎస్పీ బాలు తన ఊరివాడని, చిన్ననాటి నుంచి తెలుసునని, కోలుకుంటున్నారని విన్న వ్యక్తి ఇకలేరని వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఎస్పీ బాలు ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. Pawan Kalyan: రెమ్యునరేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ రూటు మారిందా?

‘గాన గంధర్వుడైన శ్రీ ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకరం. #SPBalasubrahmanyam’ అని ట్వీట్ చేశారు. Also read : Salman Khan About SP Balu: ఎస్పీ బాలు సార్.. మీ పాటలు నాకెంతో ప్రత్యేకం

‘వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరం. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన శ్రీ బాలు  ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారని,’ గాన గంధర్వుడు ఎస్పీ బాలు శ్రమను, సేవల్ని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More