Home> జాతీయం
Advertisement

CM Yogi Adityanath: నోయిడాలో అతిపెద్ద ఫిలిం సిటీ

భారత చలన చిత్ర పరిశ్రమలో రోజుకో వివాదం రాజుకుంటోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. యూపీలోని గౌతమబుద్ధనగర్ జిల్లా గ్రేటర్ నోయిడా మహా నగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

CM Yogi Adityanath: నోయిడాలో అతిపెద్ద ఫిలిం సిటీ

UP CM announces biggest Film City in Noida: న్యూఢిల్లీ: భారత చలన చిత్ర పరిశ్రమలో రోజుకో వివాదం రాజుకుంటోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కీలక ప్రకటన చేశారు. యూపీలోని గౌతమబుద్ధనగర్ జిల్లా గ్రేటర్ నోయిడా మహా నగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ (Film Industry) నిర్మించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ ఫిలింసిటీ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించాలని సీఎం యోగి అధికారులను శుక్రవారం ఆదేశించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీరట్, ఘజియాబాద్, బులంద్‌షహర్, హాపూర్, బాగ్‌పట్, గౌతమ్ బుద్ధనగర్ జిల్లాల పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా యోగి నిర్ణయం తీసుకున్నారు. Also read: Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్

ఈ సందర్భంగా యోగి అధికారులుతో మాట్లాడుతూ.. భారతదేశంలోనే అతిపెద్ద, అద్భుతమైన ఫిలింసిటీ నిర్మాణం కోసం నోయిడా (Noida Film City), గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో స్థలాన్ని చూసి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం చేయకుండా.. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తిచేయాలన్నారు. దీంతోపాటు మీరట్ మెట్రో ప్రాజెక్టును 2025 మార్చిలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. Also read: CM KCR: తేనే పూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు.. వ్యతిరేకించండి

ఇదిలాఉంటే.. యోగి ఆదిత్యనాథ్ చేసిన ఈ ప్రకటనను బాలీవుడ్ (Bollywood) నటి కంగనా రనౌత్ అభినందించింది. సీఎం యోగి చేసిన ఈ ప్రకటనను అభినందిస్తున్నానంటూ ఆమె ట్విట్ చేసింది. చిత్ర పరిశ్రమలో చాలా సంస్కరణలు జరగాలని.. మొదట భారతీయ చిత్ర పరిశ్రమకు ఒక పెద్ద పరిశ్రమ అవసరమంటూ ఆమె అభిప్రాయపడింది.  .  Also read: Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం

Read More