Home> జాతీయం
Advertisement

Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బోల్తా పడిన ఎక్స్ ప్రెస్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

Train Accident: ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్ - దిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో  12 బోగీలు పూర్తిగా పక్కకు ఒరిగాయి. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
 

Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బోల్తా పడిన ఎక్స్ ప్రెస్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

Uttar Pradesh chandigarh Dibrugarh express 12 coaches derail near gonda: దేశంలో కొన్నిరోజులుగా రైలు ప్రమాదాలు తరచుగా వార్తలలో నిలుస్తున్నాయి.  అధికారులు ఘటనలు జరగ్గానే కాస్తంత  హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత మరల అదే విధంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా ఉత్తర  ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.  చండీగఢ్ - దిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒక్కసారిగా 12 భోగీలు పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోయాయి. అంతేకాకుండా.. 4 ఏసీ బోగీలు సైతం బోల్తాపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు చనిపోయినట్లు తెలుస్తోంది.

 

ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన మధ్యాహ్నం 2.45 నిముషాలకు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రైన్ లో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దం వస్తు రైలు ఒక పక్కన  ఒరిగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చండీగఢ్ - దిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని 4 ఏసీ బోగీలు.. పట్టాలపైనే బోల్తా పడ్డాయి. మరో 12 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి.

రైల్వే ప్రయాణికుల ప్రకారం..  ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో రైలు నుంచి చాలా మంది దూకి బైటకు పరుగులు పెట్టినట్లు చెప్తున్నారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది,  పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాకుండా.. స్థానికులతో కలసి పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు.

ఇదిలా ఉండగా.. గోండా, జిలాహి స్టేషన్ల మధ్య.. పికురా అనే ప్రాంతంలో.. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తున్న చండీగఢ్ - దిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ప్రమాదం జరగ్గానే ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. రైలు ప్రయాణికులంతా తమ లగేజీ వదిలేసి ట్రైన్ నుంచి బైటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రస్తుతం దేశంలో మరోమారు రైల్వే ప్రయాణాలు ఎంత వరకు సేఫ్ అని.. చాలా మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

Read more: Crows: చికెన్ షాపు మీద యుద్ధం ప్రకటించిన కాకులు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో ఇదే..

ఇండియన్ రైల్వేస్ చర్యలు ఇవేనా..కేంద్రమంత్రి ఘటనలు జరగ్గానే అప్పటి వరకు హాడావిడి చేస్తారు.. మరల రోటీన్ గా ప్రమాదాలు మాత్రం జరుగుతున్నాయని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.  రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు. అదే విధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా అధికారులు వైద్యులకు సూచించారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయకచర్యలు ముమ్మరంగా నడుస్తున్నాయి. మరికొందరు ప్రయాణికులు బోగీలలో చిక్కుకుని ఉంటారని అక్కడి వాళ్లు భావిస్తున్నారు. దీనిపై మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More