Home> జాతీయం
Advertisement

UP Polls 2022: ఎన్నికల వేళ ఎస్పీకి బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న ములాయం కోడలు

అపర్ణ యాదవ్ బీజేపీలో చేరికపై ఆ పార్టీ పెద్దలు కొద్ది రోజులుగా ఆమెతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ యాదవ్‌కు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించడంతో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

UP Polls 2022: ఎన్నికల వేళ ఎస్పీకి బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న ములాయం కోడలు

Aparna Yadav Likely to Join BJP: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ జంపింగ్ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ (Mulayam Singh Yadav) చిన్న కోడలు అపర్ణ యాదవ్ (Aparna Yadav) బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పలువురు కీలక నేతలు బీజేపీని వీడిని ఎస్పీలో చేరిన నేపథ్యంలో అపర్ణ కాషాయ పార్టీలో చేరుతుండటం ఆ పార్టీకి బిగ్ బూస్ట్ అవుతుందనే చెప్పాలి.

బీజేపీలో చేరికపై ఆ పార్టీ పెద్దలు కొద్ది రోజులుగా అపర్ణ యాదవ్‌తో (Aparna Yadav) టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ యాదవ్‌కు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించడంతో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

అపర్ణ యాదవ్ ములాయం సింగ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సతీమణి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎస్పీ టికెట్‌పై అలహాబాద్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రీతా బహుగుణ జోషీ చేతిలో 33,796 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అపర్ణ యాదవ్ ఎస్పీలో కొనసాగుతున్నప్పటికీ పలు సందర్భాల్లో పార్టీ లైన్‌ను విరుద్ధంగా బీజేపీకి మద్దతుగా నిలిచారు. జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (NRC) విషయంలో బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తనవంతుగా రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చారు.

ఇప్పటికైతే అపర్ణ యాదవ్ (Aparna Yadav) బీజేపీలో చేరికపై లీకులు తప్ప ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అపర్ణను పార్టీ వీడకుండా బుజ్జగింపు చర్యలకు దిగుతారా.. లేక ఆమె దారిన ఆమెను వెళ్లనిస్తారా అన్నది వేచి చూడాలి.

కాగా, అసెంబ్లీ ఎన్నికల వేళ (UP Assembly Election 2022) బీజేపీ నుంచి ఎస్పీలోకి చేరికలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ బీజేపీని వీడి ఎస్పీలో చేరారు. వీరితో పాటు దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు ఎస్పీ కండువా కప్పుకున్నారు. బీజేపీ నుంచి ఎస్పీ లోకి వలసలు పెరగడంతో కాషాయ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. అపర్ణ యాదవ్ చేరికతో ఆ డ్యామేజ్ కంట్రోల్ అవుతుందని బీజేపీ భావిస్తుండవచ్చు.

Also Read: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై ఊహాగానాలు.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More