Home> జాతీయం
Advertisement

Lakhimpur Kheri Visit: రాహుల్, ప్రియాంకల లఖీంపూర్ ఖీరీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్

Lakhimpur Kheri Visit: దేశవ్యాప్తంగా ఆందోళన రేపిన లఖీంపూర్ ఖీరీ పర్యటనకు కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలకు అనుమతి లభించింది. రాజకీయ ప్రకంపనలు రేపిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన తీవ్రతరం చేస్తున్నాయి.
 

Lakhimpur Kheri Visit: రాహుల్, ప్రియాంకల లఖీంపూర్ ఖీరీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్

Lakhimpur Kheri Visit: దేశవ్యాప్తంగా ఆందోళన రేపిన లఖీంపూర్ ఖీరీ పర్యటనకు కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలకు అనుమతి లభించింది. రాజకీయ ప్రకంపనలు రేపిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన తీవ్రతరం చేస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖీరీలో(Lakhimpur Kheri)జరిగిన రైతు మరణాలపై రాజకీయ ప్రకంపనలు ఇంకా వస్తునే ఉన్నాయి. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఆందోళన తీవ్రతరం చేస్తున్నాయి. బన్‌బీర్‌పూర్‌ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, అజయ్‌ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా రైతులు తెలిపిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 9 మంది మృతి చెందారు. ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్ లఖీంఫూర్ పర్యటనపై రాజకీయ నేతలకు అక్కడి పోలీసులు నో ఎంట్రీ విధించారు. 

అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని(Uttar pradesh) లఖీమ్‌పూర్‌​ ఖీరీ పర్యటనకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి యూపీ ప్రభుత్వం(UP Government)నుంచి అనుమతి లభించింది. రాహుల్‌ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ వాద్రా, మరో ముగ్గురిని అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ అధికారులతో జరిపిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. లఖీంపూర్ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేతల బృందం ఢిల్లీ నుంచి బయలు దేరింది. తొలుత రాహుల్‌ గాంధీ (Rahul gandhi)లఖీమ్‌పూర్‌ వెళ్లేందుకు పోలీసుల అనుమతి నిరాకరించడంతో యోగీ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయంటూ మండిపడ్డారు. అటు రైతుల కుటుంబాల్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంక గాంధీని(Priyanka Gandhi) సీతాపూర్‌లో రెండ్రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు. ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరికీ అనుమతివ్వడంతో ప్రియాంక గాంధీ విడుదల కానున్నారు. 

మరోవైపు చండీగఢ్ రాజ్‌భవన్ ఎదురుగా ఈ ఘటనకు నిరసనగా ఆప్ నిరసన చేపట్టింది. లఖీమ్‌పూర్‌ ఖీరీ రైతుల మృతి ఘటనకు ఆప్‌ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆందోళకరంగా మారిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు నిరసనకారులపై వాటర్‌ కెనాన్స్ ప్రయోగించారు.

Also read: Lakhimpur Kheri: ఒక్క ఆధారం చూపించినా..మంత్రి పదవికి రాజీనామా చేస్తా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More