Home> జాతీయం
Advertisement

Ayushman Bharat: 70 ఏళ్లు పైబడినవారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి.. పూర్తి వివరాలు ఇవే..

Ayushman Bharat For 70 Years Above: ఆయుష్మాన్‌ భారత్‌ను 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో చేరిన వారికి ఆయుష్మాన్‌ కార్డును అందజేస్తారు. ఆస్పత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. అయితే, 70 ఏళ్లు ఆ పైబడిన వారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి వస్తారని కేంద్ర కేబినేట్‌ ఈమేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Ayushman Bharat: 70 ఏళ్లు పైబడినవారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి.. పూర్తి వివరాలు ఇవే..

Ayushman Bharat For 70 Years Above: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు అర్హులైన అందరికీ కల్పించేందుకు ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఇక పై 70 ఏళ్లు ఆ పైబడిన వారందరికీ కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి రానున్నారు.

ఆయుష్మాన్‌ భారత్‌ను 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో చేరిన వారికి ఆయుష్మాన్‌ కార్డును అందజేస్తారు. ఆస్పత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. అయితే, 70 ఏళ్లు ఆ పైబడిన వారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి వస్తారని కేంద్ర కేబినేట్‌ ఈమేరకు బుధవారం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. మొదట్లో ఈ ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా 2011 సోషియో ఎకనామిక్‌ క్యాస్ట్‌ (SECC) ప్రకారం అర్హులైన పేదలకు ఈ పథకం వర్తింపజేస్తారు. ఈ పథకంలో రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ కవరేజీ వస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతకు ఇది నిదర్శనమని మంత్రి చెప్పారు. ముఖ్యంగా ఈ సార్వత్రిక ఆరోగ్య బీమాను 70 ఏళ్లు పైనబడిన వారికి కూడా అందించడంలో మానవతా దృక్పథంతో కూడుకుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ ఆమోదంతో దేశంలోని 4.5 కోట్ల కుటుంబాలు (సీనియర్‌ సిటిజెన్లు) కూడా లబ్ది పొందుతారు. మొత్తంగా కలిపి 12.3 కోట్లు కుటుంబాలు లబ్ది చేకూరుతుంది. ఈ నిర్ణయం 70 ఏళ్లు పైబడిన పేదలు, మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి వారందరికీ 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం లభిస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి:   రైలు ప్రయాణీకులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏఐ టెక్నాలజీతో అత్యాధునిక సదుపాయం...

ఇప్పటికే ఆయుష్మాన్‌ భారత్‌లో ఉన్న కుటుంబాల సీనియర్‌ సిటిజెన్ల కోసం టాప్‌ అప్‌ రూ.5 లక్షల కవరేజీని అందిస్తుంది.  ప్రస్తుతం కవర్‌ చేయని కుటుంబాలకు కూడా షేర్డ్‌ కవరేజీని ఏటా రూ.5 లక్షలు అందిస్తుంది. ఇది అందరికీ ప్రైవేటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఈఎస్‌ఐసీలో ఉన్న వ్యక్తులకు కూడా వర్తిస్తుందని మంత్రి చెప్పారు. ప్రధాని మోదీ ప్రతి భారతీయుడు మెరుగైన వైద్య చికిత్సలు పొందాలని ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. 

ఈ ప్రయోజనాలు పొందడానికి సీనియర్‌ సిటిజెన్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో ఇప్పటికే ఉన్నవారు అందులోనే కొనసాగాలా? లేదా? అనేది వారి ఇష్టం మారాలనుకుంటే మారచ్చు. తుది నిర్ణయం వారిదే ప్రైవేటు ఇన్సూరెన్స్‌ ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో చేరినవారికి ఓ కార్డును జారీ చేస్తారు. 

ఇదీ చదవండి:  మగువా ఓ మగువా సీరియల్‌ చెంచలమ్మ.. రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా? పిక్స్‌ వైరల్‌ ..

ఆయుష్మాన్‌ భారత్‌ వృద్ధులకు కూడా అమలు చేయడం హర్షణీయం అని పబ్లిక్‌ హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. ఎందుకంటే వృద్ధులకు వయస్సురీత్యా వచ్చే జబ్బులు ఉంటాయి. గుండె, డయాబెటీస్‌ ఆర్థరైటీస్‌ వ్యాధులతో బాధపడుతుంటారు. కాబట్టి కేంద్ర ఈ నిర్ణయం ఎంతగానో వారికి ఉపయోగపడుతుంది అంటున్నారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More