Home> జాతీయం
Advertisement

Election Manifesto: పశ్చిమ బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా

Election Manifesto: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు బీజేపీ అస్త్రాలు బయటకు తీస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రధానంగా ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

Election Manifesto: పశ్చిమ బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా

Election Manifesto: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు బీజేపీ అస్త్రాలు బయటకు తీస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రధానంగా ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో(West bengal elections) అధికార పార్టీ టీఎంసీ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో (Tmc Manifesto) విడుదల చేసింది. ఎన్నికల్లో పట్టు సాధించేందుకు, బెంగాల్ పీఠంపై కాషాయజెండా ఎగురవేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఒక్కొక్కటిగా అస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఆ పార్టీ ముఖ్యనేత , కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కత్తాలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో( Election Manifesto) విడుదల చేశారు. చాలా ఏళ్ల నుంచి మేనిఫెస్టో అనేది కేవలం ఓ ప్రక్రియగా మారిందని..బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టో ప్రాధాన్యత పెరిగిందని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit shah) తెలిపారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారమే నడుస్తోందన్నారు.

ప్రజల్నించి సూచనలు స్వీకరించి మేనిఫెస్టో రూపొందించామన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తావించినవి కేవలం ప్రకటనలు కావని..దేశంలో 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న, దేశంలోని అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ ఇచ్చిన వాగ్దానాలని అమిత్ షా అన్నారు. మేనిఫెస్టోలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌‌ను సోనార్ బంగ్లాగా అంటే బంగారు బెంగాల్ ( Golden Bengal) ‌గా మారుస్తామనే హామీకు సంబంధించి రోడ్‌మ్యాప్ ఉంది. మరోవైపు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ( 33 percent reservations for women) కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 

Also read: Coronavirus: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్, ఆందోళనలో ఎంపీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More