Home> జాతీయం
Advertisement

Amit Shah Tour: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన

Amit Shah Tour: జమ్ముకశ్మీర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతలు, అభివృద్ధికి విఘాతం కల్గిస్తే సహించమంటూ ఉగ్రవాదులకు హెచ్చరిక జారీ చేశారు అమిత్ షా. పూర్తి వివరాలు ఇలా..
 

 Amit Shah Tour: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన

Amit Shah Tour: జమ్ముకశ్మీర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతలు, అభివృద్ధికి విఘాతం కల్గిస్తే సహించమంటూ ఉగ్రవాదులకు హెచ్చరిక జారీ చేశారు అమిత్ షా. పూర్తి వివరాలు ఇలా..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah Jammu Kashmir Tour)మూడ్రోజుల జమ్ముకశ్మీర్ పర్యటన కొనసాగుతోంది. నిన్న జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును అమిత్ షా సందర్శించారు. విధి నిర్వహణలో ఉన్న జవాన్లతో మాట్లాడారు. కుటుంబాల మంచి చెడ్డల్ని మోదీ ప్రభుత్వం చూసుకుంటుందని..ఏ విధమైన ఆందోళన చెందకుండా దేశ రక్షణ బాధ్యతల్ని నిర్వహించాలని కోరారు. సరిహద్దులోని చిట్టచివరి గ్రామమైన మక్వాల్‌ను కూడా అమిత్ షా సందర్శించారు. సరిహద్దు ప్రాంతాల్లో అన్నిరకాల మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. 

మరోవైపు భగవతి నగర్ ర్యాలీలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. గత 7 దశాబ్దాలపాటు పరిపాలన సాగించిన మూడు కుటుంబాలు ప్రజలకు చేసింది ఏమీ లేదని పరోక్షంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీల్ని ఉద్దేశించి విమర్శలు ఎక్కుపెట్టారు. జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah)ఉద్ఘాటించారు. సాధారణ పౌరులను ముష్కరులు హత్య చేస్తున్నారని, ఇలాంటి ఘోరాలకు చరమగీతం పాడతామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రానికి 12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 2022 నాటికి మరో 51 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఈ పెట్టుబడులతో జమ్మూకశ్మీర్‌లో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. మరోవైపు 210 కోట్లతో నిర్మించిన ఐఐటీ కొత్త క్యాంపస్‌(Jammu Kashmir IIT Campus) ప్రారంభించారు. 

Also read: G 20 Summit: జి 20 దేశాల సదస్సుకు హాజురుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More