Home> జాతీయం
Advertisement

యాన్టీ టెర్రరిస్ట్ ఆపరేషన్: భారత ఆర్మీ వేటలో మరో ఇద్దరు ఉగ్రవాదులు  హతం

జమ్మూ కశ్మీర్ లో  భారత ఆర్మీ  చేపట్టిన యాన్టీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది. 

యాన్టీ టెర్రరిస్ట్ ఆపరేషన్: భారత ఆర్మీ వేటలో మరో ఇద్దరు ఉగ్రవాదులు  హతం

జమ్మూకశ్మీర్: యాన్టీ టెర్రరిస్ట్ ఆపరేషన్ లో ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ వేట కొనసాగుతోంది. కుప్వారాలోని హంద్వారా ప్రాంతంలో ఉగ్రమూకలు తలదాచుకున్నారనే ఇంటలిజెన్సీ సమాచారంతో  భారత భద్రతాబలగాలు ఆ ప్రాంతానికి చేరుకొన్నాయి. కొందరు ఉగ్రమూకలు ఓ ఇంట్లో బసచేసి ఉన్నారనే సమాచారంతో ఆర్మీ ఈ ఇంటిని చుట్టుముట్టింది. దీంతో తేరుకున్న ఉగ్రమూకలు పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు కాల్పులకు తెగబడేందుకు ప్రయత్నించగా భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పులో లష్కరే తోయిబాకి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యాయు. ఈ క్రమంలో భారత జవానుకు గాయాలయ్యాయి. ఉగ్రవాదులను మట్టబెట్టేందుకు ప్రారంభించిన ఈ కూబింగ్ లో భారత ఆర్మీ , సీఆర్ పీఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా పాల్గొనడం గమనార్హం.
 

Read More