Home> జాతీయం
Advertisement

Omicron cases in India: మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు

Omicron cases in India: కరోనా ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్​ సోకినట్లు వెల్లడైంది.

Omicron cases in India: మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు

Omicron cases in India: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న వివిధ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఒమిక్రాన్ కేసులు పెరగ్గా.. తాజాగా మహారాష్ట్రలో (New Omicron cases in MH) మరో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్​ గుర్తించినట్లు మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు. అమెరికా నుంచి వచ్చిన 36 ఏళ్ల అతని స్నేహితుడికి కూడా ఒమిక్రాన్​ సోకినట్లు తెలిపారు. దీనితో ఇప్పటి వరకు మహారాష్ట్ర మొత్తం మీద ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు 10కి చేరాయి.

ఇద్దరూ వ్యాక్సిన్ తీసుకున్నా..

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలిన ఆ ఇద్దరు వ్యక్తులు కొవిడ్ వ్యాక్సిన్​ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ఇద్దరు ఫైజర్​ టీకా వేసుకున్నట్లు వివరించారు.

అయితే వారిలో ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు ముంబయి మహారాష్ట్ర ఆరోగ్య విభాగ అధికారులు. ప్రస్తుతం ఆ ఇద్దరిని ముంబయిలోని సెవెన్​ హిల్స్​ హాస్పిటల్ చేర్పించినట్లు చెప్పారు.

ప్రస్తుతం దేశంలో 23 కేసులు..

కొత్త వాటితో కలిపి దేశవ్యాప్తంగా ప్రస్తుతం 23 ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు (Total Omicron cases in India) ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 10 కేసులు, రాజస్థాన్​లో 9, కర్ణాటకలో 2.. ఢిల్లీ, గుజరాత్​లో ఒక్కే కేసు చొప్పున బయపడ్డాయి. ఇందులో 17 కేసులు నిన్న ఒక్క రోజే (ఆదివారం) గుర్తించడం గమనార్హం.

కఠిన నిబంధనలు..

ఒమిక్రాన్ భయాలతో దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులు ఆర్​టీ-పీసీఆర్ టెస్ట్​ చేయించుకోవడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్​పోర్ట్​లో పాటిటివ్​గా తేలిన వారి శాంపిళ్లను జీనోమ్​ సీక్వెన్సింగ్​కు పంపిస్తున్నారు అధికారులు.

Also read: Nagaland firing: 'నాగాలాండ్ కాల్పుల ఘటన పొరపాటు- బాధ్యులపై చర్యలు తీసుకుంటాం'

Also read: Delhi Airport: రైల్వే స్టేషన్‌ను తలపిస్తున్న ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. అసలు కారణం ఏంటంటే?!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More