Home> జాతీయం
Advertisement

Shirdi Sai Baba: షిర్డీలోకి అడుగుపెట్టకుండా తృప్తి దేశాయ్‌‌పై నిషేధం

షిర్డీలోకి ప్రవేశించకుండా సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ ( Trupti Desai ) పై తాత్కాలిక నిషేధం విధించారు. మహారాష్ట్రలోని ఈ షిర్డీ పరిధిలోకి ఈనెల 8 నుంచి 11న అర్ధరాత్రి వరకు ప్రవేశించరాదంటూ షిర్డీ ఏరియా సబ్‌-డివిజనల్‌ కార్యాలయం ( Shirdi Sub Divisional Office ) మంగళవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది.

Shirdi Sai Baba: షిర్డీలోకి అడుగుపెట్టకుండా తృప్తి దేశాయ్‌‌పై నిషేధం

Activist Trupti Desai barred entering Shirdi: పూణె: షిర్డీలోకి ప్రవేశించకుండా సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ ( Trupti Desai ) పై తాత్కాలిక నిషేధం విధించారు. మహారాష్ట్రలోని బాబా మందిర ప్రాంతమైన షిర్డీ ( Shirdi ) పరిధిలోకి ఈనెల 8 నుంచి 11న అర్ధరాత్రి వరకు ప్రవేశించరాదంటూ షిర్డీ ఏరియా సబ్‌-డివిజనల్‌ కార్యాలయం ( Shirdi Sub Divisional Office ) మంగళవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది. శాంతి, భద్రతల పరిరక్షణ దృష్ట్యా డిసెంబరు 11వ తేదీ వరకు షిర్డీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి ప్రవేశించరాదంటూ సబ్ డివిజనల్ కార్యాలయం తృప్తి దేశాయ్‌‌కు సూచించింది. ఒకవేళ ఆమె ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188  కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Also read: Shirdi Sai Baba Temple: సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే బాబా దర్శనం

ఇదిలాఉంటే.. షిర్డీ సాయి బాబా ( Shirdi Sai Baba ) దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు భారతీయ సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి మందిరం లోపలికి ప్రవేశించాలని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ( Shri Saibaba Sansthan Trust ).. ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే భక్తుల వస్త్రధారణ మంచిగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ షిర్డీ ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన బోర్డులను తొలగిస్తానంటూ తృప్తి దేశాయ్‌ ఇటీవల అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శాంతి, భద్రతల పరిరక్షణ దృష్ట్యా మెజిస్ట్రేట్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. Also read: Farmer protests: ఎటూ తేలని చర్చలు.. నేటి భేటీ రద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Read More