Home> జాతీయం
Advertisement

Rahul Gandhi: కాంగ్రెస్‌లో కథ మొదటికి..తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ..!

Rahul Gandhi: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదు. పదవిని చేపట్టేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విముఖత చేపుతున్నారు.

Rahul Gandhi: కాంగ్రెస్‌లో కథ మొదటికి..తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ..!

Rahul Gandhi: ఏఐసీసీలో కథ మొదటి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపికపై స్పష్టత కనిపించడం లేదు. చీఫ్‌ ఎంపిక కోసం కాంగ్రెస్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ పదవిని అగ్ర నేత రాహుల్ గాంధీనే చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఈమేరకు ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే అధ్యక్షుడి పదవి చేపట్టేందుకు రాహుల్ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.

ఇటు ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం విముఖంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో తదుపరి అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య పార్టీ చీఫ్‌ ఎన్నిక పూర్తి చేస్తామని ఇప్పటికే ఆ పార్టీ వెల్లడించింది. ఎన్నికల్లో పాల్గొనే నేతల లిస్ట్‌ను సైతం తయారు చేశారు. త్వరలోనే ఎన్నికల తేదీపై క్లారిటీ రానుంది. ఎలాగైనా రాహుల్‌ను తిరిగి ఎన్నుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేతలు యోచిస్తున్నారు.

ఐతే ఆయన నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదని ఓ సీనియర్ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. వయసురీత్యా ప్రస్తుత కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా లేనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ పేరును తెరపైకి తీసుకువస్తున్నారు.

గాంధీ కుటుంబానికే పార్టీ పగ్గాలు అప్పగించాలని మెజార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబసభ్యులే పార్టీ బాధ్యతలు చూశారని గుర్తు చేస్తున్నారు. చివరి వరకు రాహుల్, సోనియా గాంధీ ముందుకు రాకపోతే ప్రియాంక గాంధీ అప్పగించే అవకాశం ఉంది. ఈమేరకు ఆ పేరు ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఐతే ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఆమె విఫలమయ్యారు.

దీంతో ఆ పేరు తెరపైకి రాకపోవచ్చని మరో వర్గం అంటోంది. ఈక్రమంలోనే కొత్త అధ్యక్షుడు కొత్త వారే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో 2019లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. ఆ తర్వాత సీనియర్ నేతల విన్నపం మేరకు ఆ పదవిని సోనియా గాంధీ చేపట్టారు. ఐతే ఇటీవల ఆ పార్టీలో సీనియర్ నేతలు వ్యతిరేక గళం వినిపించారు. 

దీంతో ఆమె రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో సీడబ్ల్యూసీ సమావేశంలో రాజీనామా లేఖను ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఐతే సీనియర్ నేతల విజ్ఞప్తితో సోనియా గాంధీ వెనక్కి తగ్గారు. అధ్యక్ష పదవికి రాహుల్ దూరంగా ఉన్నా..పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే నెల నుంచి కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు.

Also read:Rain Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం..తెలుగు రాష్ట్రాలకు వెదర్ అలర్ట్..!

Also read:Heavy Rains: ఉత్తరాధిలో జల విలయం..కొట్టుకుపోయిన బ్రిడ్జ్‌లు..వీడియో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More