Home> జాతీయం
Advertisement

Toll Tax New Rules: టోల్‌ట్యాక్స్ చెల్లింపులో ఇప్పుడు కొత్త నిబంధనలు, జర్నీని బట్టే ట్యాక్స్

Toll Tax New Rules: నేషనల్ హైవేపై నిత్యం ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. టోల్‌ట్యాక్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు చేసింది. 

Toll Tax New Rules: టోల్‌ట్యాక్స్ చెల్లింపులో ఇప్పుడు కొత్త నిబంధనలు, జర్నీని బట్టే ట్యాక్స్

మీరు జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణిస్తుంటారా..అయితే ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే. టోల్‌గేట్ ట్యాక్స్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 

నేషనల్ హైవే ప్రయాణాల్లో టోల్‌ట్యాక్స్ ఇబ్బంది ఉంటుంది. అందుకే ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్‌తో గుడ్‌న్యూస్ కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం టోల్‌ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు చేసింది. టోల్‌ట్యాక్స్‌కు సంబంధించి ఓ చట్టం కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టెక్నాలజీ వినియోగం

కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అందించిన సూచనల ప్రకారం.. టోల్‌ట్యాక్స్ చెల్లించకపోతే శిక్ష ఉండదు. రానున్నకాలంలో టోల్‌ట్యాక్స్ వసూలు చేసేందుకు టెక్నాలజీ వినియోగించనున్నారు. 

చట్టం తెచ్చే ప్రయత్నాలు

ఇప్పటి వరకూ టోల్‌ట్యాక్స్ చెల్లించకపోతే శిక్ష విధించే పరిస్థితి చట్టంలో లేదు. కానీ టోల్‌ట్యాక్స్ సంబంధించి ఒక చట్టం తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు టోల్‌ట్యాక్స్ నేరుగా బ్యాంకు ఎక్కౌంట్ల నుంచి కట్ కానుంది. దీనికోసం ప్రత్యేకమైన చర్యలేవీ ఉండవు.

నేరుగా ఎక్కౌంట్ నుంచి డబ్బులు కట్

ఇప్పుడు టోల్‌ట్యాక్స్ నేరుగా చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా మీ బ్యాంకు ఎక్కౌంట్ నుంచి కట్ అవుతుంది. 2019లో కొత్త కార్లు ఫీడెడ్ నెంబర్ ప్లేట్లతో వచ్చేలా ఓ నిబంధన తీసుకొచ్చామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. అందుకే గత నాలుగేళ్లలో విడుదలైన వాహనాలకు వేర్వేరు నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. 2024 కు ముందే దేశంలో 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేలు సిద్ధమౌతాయి. రోడ్ల విషయంలో ఇండియా..అమెరికాతో సమానంగా ఉండనుందని మంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో టోల్‌ట్యాక్స్ వసూలు చేసేందుకు టెక్నాలజీ వినియోగిస్తామన్నారు నితిన్ గడ్కరీ.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా వ్యక్తి టోల్‌రోడ్‌పై 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించినా సరే..75 కిలోమీటర్ల ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొత్త వ్యవస్థలో ఎంతదూరం ప్రయాణిస్తే..అంతదూరానికే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌ఏఐ కష్టాల్లో ఉందనే విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. ఎన్‌హెచ్‌ఏఐ పరిస్థితి బాగుందని..డబ్బుల కొరత లేదని తెలిపారు. 

Also read: Delhi MCD Elections: టికెట్ దక్కలేదని టవర్ ఎక్కిన ఆప్‌ నాయకుడు.. వినూత్న నిరసన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More