Home> జాతీయం
Advertisement

Corona third wave: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ హెచ్చరికలు

PM Modi warning ahead of COVID third wave: న్యూ ఢిల్లీ: త్వరలోనే కరోనావైరస్ థర్డ్ వేవ్ రానుందనే అంచనాలు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలోనే హిల్ స్టేషన్లలో పర్యటించేందుకు వస్తున్న వందల, వేల మంది పర్యాటకులు కొవిడ్-19 మార్గదర్శకాలు (COVID-19 guidelines) అనుసరించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.

Corona third wave: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ హెచ్చరికలు

PM Modi warning ahead of COVID third wave: న్యూ ఢిల్లీ: త్వరలోనే కరోనావైరస్ థర్డ్ వేవ్ రానుందనే అంచనాలు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలోనే హిల్ స్టేషన్లలో పర్యటించేందుకు వస్తున్న వందల, వేల మంది పర్యాటకులు కొవిడ్-19 మార్గదర్శకాలు (COVID-19 guidelines) అనుసరించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం ప్రధాని మోదీ ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన వర్చువల్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ ప్రభావాన్ని నివారించడానికి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఓవైపు కరోనా మహమ్మారి వ్యాపిస్తుండగానే మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని హిల్ స్టేషన్లకు భారీ సంఖ్యలో చేరుకుంటున్న పర్యాటకులు ఫేస్ మాస్క్ (Face mask) ధరించకుండానే రద్దీ ప్రదేశాలకు, మార్కెట్లకు వెళ్లడాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. "కరోనావైరస్ కారణంగా పర్యాటకం, వ్యాపారం బాగా ప్రభావితం అయ్యాయన్నది నిజం. అయితే, అదే సమయంలో మాస్కులు ధరించకుండా హిల్ స్టేషన్లు, మార్కెట్లలో జనం రద్దీ ఏర్పడటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు'' అని ప్రధాని పేర్కొన్నారు.

Also read: Sputnik V vaccine: సెప్టెంబర్ నుంచి సీరమ్‌లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీ

"వైరస్ స్వయంగా తనంతట తానుగా రాదు, వెళ్ళదు. మనం నియమాలను ఉల్లంఘించినప్పుడే వైరస్ మనతో వస్తుంది. అజాగ్రత్తగా వ్యవహరించడం, రద్దీ ప్రదేశాల్లో తిరగడం వంటి వాటితోనే కోవిడ్ కేసులు (COVID-19 cases) పెరుగుతాయని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు'' అని ప్రధాని మోదీ గుర్తుచేశారు.

"జనం రద్దీని నివారించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కరోనా థర్డ్ వేవ్‌ని (Corona third wave) నివారించడానికి మనమందరం కలిసి పనిచేయాలి" అని ప్రధాని మోదీ సూచించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి (Manali tour), ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ వంటి ఫేమస్ హిల్ స్టేషన్లను (Mussoorie tour) సందర్శిస్తున్న పర్యాటకులు కొవిడ్ మార్గదర్శకాలు పాటించడం లేదని చూపించే పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Also read: Corona Nasal Vaccine: నాసల్ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు, ఆశలు రేపుతున్న నాసల్ స్ప్రే వ్యాక్సిన్

కరోనావైరస్ వేరియంట్స్‌పై (Coronavirus variants) నిఘా ఉంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన పీఎం మోదీ.. ఎప్పటికప్పుడు రూపాంతరం (Virus mutations) చెందుతున్న వైరస్ ఎంత ఇబ్బంది కలిగిస్తుందనే అంశంపై నిపుణులు నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం అసలే పనికిరాదు అని ప్రధాని మోదీ హితవు పలికారు.

Also read: Covaxin Emergency Use: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO త్వరలోనే అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More