Home> జాతీయం
Advertisement

KCR DELHI TOUR: కేసీఆర్ చెప్పే సంచలనం ఇదేనా? బీజేపీకి గండమేనా?

KCR DELHI TOUR: కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఆయన చెప్పిన సంచలనం ఏంటీ? అన్న చర్చ రాజకీయా వర్గాల్లో సాగుతోంది.కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త కూటమి ప్రకటిస్తారా? మోడీ సర్కార్ కు సంబంధించి ఏమైనా సంచలన విషయాలు వెల్లడిస్తారా ? అసలు ఆయన ఏం చేయబోతున్నారు.. ఢిల్లీలో జరుపుతున్న చర్చలు ఏంటి అన్న ఆసక్తి తెలంగాణతో పాటు టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది.

KCR DELHI TOUR: కేసీఆర్ చెప్పే సంచలనం ఇదేనా? బీజేపీకి గండమేనా?

KCR DELHI TOUR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పర్యటన బిజీబీజీగా సాగుతోంది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. గత రెండు రోజులు కీలక సమావేశాలు నిర్వహించారు. శనివారం ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఢిల్లీ ప్రభుత్వం పథకాలను పరిశీలించారు. ఆదివారం మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో మంతనాలు సాగించారు. ఇద్దరూ కలిసి చండీఘడ్ వెళ్లారు. గాల్వాన్ ఘటనలో అమరులైన జవాన్లతో పాటు రైతు ఉద్యమంలో చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున సాయం అందించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసంలో ముగ్గురు ముఖ్యమంత్రులు చర్చించారు. వీళ్ల మధ్య జాతీయ రాజకీయాలపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది.

జాతీయ స్థాయిలో కేసీఆర్ చేస్తున్న పర్యటనలు, జరుపుతున్న చర్చలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చగా మారాయి. శనివారం కేజ్రీవాల్ నివాసం దగ్గర మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. త్వరలో దేశంలో సంచలనం జరగబోతోందని చెప్పారు. ఏం జరగబోతుందో చుద్దామని కామెంట్ చేశారు. దీంతో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఆయన చెప్పిన సంచలనం ఏంటీ? అన్న చర్చ రాజకీయా వర్గాల్లో సాగుతోంది.కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త కూటమి ప్రకటిస్తారా? మోడీ సర్కార్ కు సంబంధించి ఏమైనా సంచలన విషయాలు వెల్లడిస్తారా ? అసలు ఆయన ఏం చేయబోతున్నారు.. ఢిల్లీలో జరుపుతున్న చర్చలు ఏంటి అన్న ఆసక్తి తెలంగాణతో పాటు టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. కేసీఆర్ పర్యటనను మిగితా పార్టీలు గమనిస్తున్నాయి.

అయితే బీజేపీకి షాకిచ్చేలా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల కేంద్రంగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల గురించే వివిధ పార్టీలతో నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నుంచి ఉమ్మడి అభ్యర్థిని ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో నిలపాలని కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూమిటికే ఆధిక్యం ఉంది. అయితే కావాల్సిన పూర్తి మెజార్టీ లేదు. రెండు, మూడు ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం. ఇదే అదనుగా కేసీఆర్ తన వ్యూహాలు అమలు చేయబోతున్నారని అంటున్నారు. తనతో కలిసివచ్చేలా ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్నారనే టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కూటమికి చిక్కులు తేవాలన్నది కేసీఆర్ ప్రధాన వ్యూహంగా ఉందంటున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ పార్టీ మద్దతు అవసరం. అందుకే ఇటీవల కాలంలో జగన్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. అదనపు రుణాలకు అనుమతి ఇవ్వడం.. సీఎస్ పదవి కాలం మరో ఆరు నెలలు పొడిగించడం వంటివి అందులోనే భాగమనే టాక్ ఉంది. అయితే తెలంగాణ సీఎంతోనూ వైఎస్ జగన్ కు మంచి సంబంధాలున్నాయి. కేసీఆర్ ను అసెంబ్లీలో కొనియాడారు జగన్. కేసీఆర్ కూడా జగన్  తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. అంతేకాదు పాలనకు సంంబధించిన విషయాల్లో జగన్ కు కేసీఆర్ సలహాలు ఇస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తన మిత్రుడైన జగన్ ను బీజేపీకి మద్దతు ఇవ్వకుండా చేయగలిగితే.. కేసీఆర్ చెప్పిన సంచనం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆ దిశగానే కేసీఆర్ కార్యాకరణ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ కోసం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ సీఎం జగన్ రెడ్డి నిలబడుతారా..చూడాలి మరీ..

READ ALSO: Omicron: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్... తమిళనాడులో బీఏ.4, తెలంగాణలో బీఏ.5 వేరియంట్ గుర్తింపు..   

READ ALSO: Video: ఆదివాసీ బాలికపై బాలుడి అమానుష దాడి... సీఎం ఆదేశాలతో అరెస్ట్...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More