Home> జాతీయం
Advertisement

ఐశ్వర్యారాయ్‌తో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పెళ్లి..?

ఏంటండీ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా.. కానీ నిజమండీ బాబూ..! లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ఐశ్వర్యారాయ్. కానీ సినీ స్టార్ ఐశ్వర్యారాయ్ కాదండోయ్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యారాయ్.

ఐశ్వర్యారాయ్‌తో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పెళ్లి..?

ఏంటండీ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా.. కానీ నిజమండీ బాబూ..! లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ఐశ్వర్యారాయ్. కానీ సినీ స్టార్ ఐశ్వర్యారాయ్ కాదండోయ్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యారాయ్. బీహార్ రాజకీయాల్లో దరోగా రాయ్ పెట్టింది పేరు. 1970ల్లో ఆయన బిహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

ఆయన కుమారుడు చంద్రికా రాయ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూతురే ఈ ఐశ్వర్యారాయ్. అయితే గతంలో లాలూ భార్య రబ్రీదేవి తనకు రాబోయే కోడలు ఎలా ఉండాలో తన కుమారుడికి పబ్లిక్‌గానే చెప్పారు. "షాపింగ్‌కని, సినిమాలకనీ వెళ్లే కోడలు నాకు అక్కర్లేదు. నాకు కాబోయే కోడలు గుణవంతురాలు అయ్యుండాలి. నాకు గౌరవం ఇవ్వాలి. " అని తెలిపారు. మరి... ఈ ఐశ్వర్యారాయ్‌కి ఆ గుణగుణాలు ఉన్నాయో లేవో తెలియాలంటే వేచి చూడాల్సిందే

fallbacks

fallbacks

fallbacks

fallbacks

 

Read More