Home> జాతీయం
Advertisement

Chandrababu With NDA: కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు భారీ షాక్‌.. ఇక వారి ఆశలు గల్లంతే

Chandrababu Naidu Big Shock INDI Alliance: ఎన్నికల్లో గతానికన్నా అధిక స్థానాలు గెలుపొందడం.. తమ మిత్రపక్షాలు కూడా అధిక సీట్లు కొల్లగొట్టడంతో అధికారంపై ఆశతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు భారీ షాకిచ్చారు.

Chandrababu With NDA: కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు భారీ షాక్‌.. ఇక వారి ఆశలు గల్లంతే

Chandrababu Naidu: పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి తాజా లోక్‌సభ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. సెంచరీకి ఒక సీటు తక్కువగా సాధించిన కాంగ్రెస్‌ పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి రెండో అతిపెద్ద కూటమిగా ఏర్పడింది. అయితే కొన్ని స్థానాలకు దూరంగా ఉన్న ఈ కూటమికి తెలుగుదేశం పార్టీ ఆశాకిరణంగా మారింది. అధికారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ షాకిచ్చారు. తాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితోనే కలిసి వెళ్తానని ప్రకటించారు. దీంతో ఇండియా కూటమి అధికారానికి దూరమైంది.

Also Read: Chiranjeevi Emotional: 'తమ్ముడు నువ్వు గేమ్‌ చేంజర్‌వి, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌వి' పవన్‌పై చిరంజీవి ప్రశంసలు

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలు గెలుపొంది దేశంలోనే అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీ టీడీపీనే. మొత్తం 16 లోక్‌సభ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. వాస్తవంగా అయితే టీడీపీ, జనసేనతో కలిపి ఎన్డీయే కూటమికి 293 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ 272కు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే టీడీపీ మద్దతు తెలపకపోతే మాత్రం ఎన్డీయే కూటమి అధికారం చేపట్టే అవకాశాన్ని కోల్పోతుంది. ఇది గ్రహించిన ఇండియా కూటమి చంద్రబాబుకు గాలం వేసే ప్రయత్నం చేసింది. శరద్‌ పవార్‌, కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌ ద్వారా టీడీపీని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ కుట్రలు ఫలించలేదు.

Also Read: YS Sharmila: నాడు అన్నను గెలిపించిన చెల్లెలు.. నేడు అన్నను ఓడించిన షర్మిల

 

ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు నాయుడు బీజేపీకే జైకొట్టారు. నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ చంద్రబాబు సంతకం చేశారు. దీంతో ఇండియా కూటమికి భారీ షాక్‌ తగిలింది. టీడీపీ తమ వైపు వస్తే అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇక జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ కూడా ఎన్డీయే వైపే నిలవడంతో ఇక ఇండియా కూటమికి అధికారం చేపట్టడం లేదు.

భవిష్యత్‌పై ఆశలు..
ప్రస్తుతం ఎన్డీయే కూటమితోనే కొనసాగుతామని టీడీపీ, జేడీయూలు ప్రకటించాయి. కానీ భవిష్యత్‌లో అవి మనసు మార్చుకుంటాయనే భావనలో ఇండియా కూటమి ఉన్నాయి. ఎందుకంటే గతంలో చాలాసార్లు చంద్రబాబు, నితీశ్ కుమార్‌ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో కూడా అలాంటి పరిణామాలు ఉంటాయనే భావనలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చోవడమే ప్రస్తుతం ఇండియా కూటమి ముందు ఉన్న పని.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Read More