Home> జాతీయం
Advertisement

Tamilnadu: ఏఐఏడీఎంకేలో వర్గపోరు, చిన్నమ్మ జపం ప్రారంభించిన పన్నీర్ సెల్వమ్

Tamilnadu: తమిళనాట ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అంతర్గతపోరు మొదలైంది. చిన్నమ్మ అలియాస్ శశికళ రేపిన కలకలం వర్గపోరుగా దారితీస్తోంది. పన్నీర్ సెల్వమ్ హఠాత్తుగా చిన్నమ్మను ఎందుకు తల్చుకుంటున్నారనేది ఆసక్తిగా మారింది.
 

Tamilnadu: ఏఐఏడీఎంకేలో వర్గపోరు, చిన్నమ్మ జపం ప్రారంభించిన పన్నీర్ సెల్వమ్

Tamilnadu: తమిళనాట ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అంతర్గతపోరు మొదలైంది. చిన్నమ్మ అలియాస్ శశికళ రేపిన కలకలం వర్గపోరుగా దారితీస్తోంది. పన్నీర్ సెల్వమ్ హఠాత్తుగా చిన్నమ్మను ఎందుకు తల్చుకుంటున్నారనేది ఆసక్తిగా మారింది.

తమిళనాడులో(Tamilnadu) ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేలో(AIADMK) పన్నీర్ సెల్వమ్ వర్సెస్ పళని స్వామి మొదలైపోయింది. చిన్నమ్మ రేపిన కలవరం పార్టీలో అంతర్గతపోరుకు దారితీసింది. ఏఐఏడీఎంకే పార్టీ కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ ముందుకు సాగుతుంటే పార్టీని కాపాడుకునే క్రమంలో పన్నీర్ సెల్వమ్ వర్సెస్ పళనిస్వామిల మధ్య పోరు ప్రారంభమైంది. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్ సెల్వమ్ హఠాత్తుగా చిన్నమ్మ శశికళ నామస్మరణ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్నమ్మను ముందు నుంచీ పార్టీలో రాకుండా పళనిస్వామి వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో అందరితో చర్చించి చిన్నమ్మ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వమ్ వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యమేంటనేది అంతుబట్టకుండా ఉంది. తమిళనాట ఇప్పుడీ అంశమే హాట్‌టాపిక్‌గా నిలిచింది.

పార్టీ  ప్రధాన కార్యదర్శి తానేనంటూ శశికళ(Sasikala)చెబుతున్న నేపధ్యంలో ఆ పదవి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు పళని స్వామి రచించిన వ్యూహమనేది రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. డిసెంబర్ నెలలో అన్నాడీఎంకే కార్యవర్గం, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి..రద్దైన పదవిని మరోసారి పునరుద్ధరించి చేజిక్కించుకునేందుకు పళనిస్వామి వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. జంట నాయకత్వాన్ని పక్కనబెట్టి..ఏకాధిపత్యం లక్ష్యంగా సీనియర్లతో పళని స్వామి(Palani Swami) రహస్య మంతనాలు పన్నీర్ సెల్వమ్ దృష్టికి చేరాయి. అందుకే హఠాత్తుగా ఆయన చిన్నమ్మ జపం ప్రారంభించారు. పళనికి చెక్ పెట్టేందుకు పన్నీర్ సెల్వమ్ (Panneer Selvam)శశికళ ప్రస్తావన తీసుకొచ్చారు. ఏఐఏడీఎంకేలో అంతర్గతపోరు నేపధ్యంలో పార్టీ కేడర్‌లో చొచ్చుకెళ్లేందుకు చిన్నమ్మ దృష్టి సారించారు. అటు మద్దతుదారులు సైతం ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. తమిళనాడులోని తంజావూరు, మధురై, రామనాథపురం ప్రాంతాల్లో మూడ్రోజుల పాటు శశికళ పర్యటించనున్నారు. 

Also read: ZEEL, invesco EGM: జీ ఎంటర్‌టైన్మెంట్‌కి అనుకూలంగా బాంబే హై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More