Home> జాతీయం
Advertisement

Tamil Nadu Assembly Election Voting Result: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష DMKకు ఆధిక్యం 

Tamil Nadu Result 2021 Live Update: తమిళనాడులో మొత్తం 234 సీట్లకు ఇటీవల ఎన్నికలు నిర్వహించగా, నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ తొలి రౌండ్‌లో ప్రతిపక్ష డీఎంకే ఆధిక్యం కొనసాగిస్తోంది.

Tamil Nadu Assembly Election Voting Result: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష DMKకు ఆధిక్యం 

Tamil Nadu Assembly Election Voting Result Live: దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తమిళనాడులో తాము మరోసారి అధికారంలోకి రానున్నామని అధికార అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ధీమాగా ఉంది. ప్రజలు తమ వైపు ఉన్నారని, ఈ సారి కచ్చితంగా విజయం సాధిస్తామని డీఎంకే శ్రేణులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

తమిళనాడులో మొత్తం 234 సీట్లకు ఇటీవల ఎన్నికలు నిర్వహించగా, నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ తొలి రౌండ్‌లో ప్రతిపక్ష డీఎంకే ఆధిక్యం కొనసాగిస్తోంది. డీఎంకే కూటమి 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అన్నాడీఎంకే 4 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎంకే స్టాలిన్ డీఎంకేకు ఆధిక్యం రావడంతో ఫలితాలు తమకే అనుకూలమని ఆ కూటమి శ్రేణులు మిగతా రౌండ్ల లెక్కింపు కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధిల మరణానంతరం అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. 

Also Read: Assembly Election 2021 : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

చెన్నై, కోయంబత్తూర్‌లలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరుచుకున్నాయి. భారీ మెజార్టీతో విజయం సాధించి తమిళనాడులో అధికారంలోకి రానున్నామని డీఎంకే అధినేత స్టాలిన్ ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమిని విజయం వరించినట్లయితే తమిళనాడుకు నూతన వ్యక్తి ముఖ్యమంత్రి కానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం స్టాలిన్ ప్రతిపక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు.  

Also Read: Assembly Elections 2021 Results Live News Update: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More