Home> జాతీయం
Advertisement

Supreme Court on NEET Row 2024: తప్పు జరిగితే ఒప్పుకోవల్సిందే, ఎన్టీయేకు సూచించిన సుప్రీంకోర్టు

Supreme Court on NEET Row 2024: నీట్ 2024 పరీక్ష ఫలితాల వివాదం ఇంకా సమసిపోలేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం నీట్ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సహించకూడదని హెచ్చరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఖరిపై మండిపడింది.

Supreme Court on NEET Row 2024: తప్పు జరిగితే ఒప్పుకోవల్సిందే, ఎన్టీయేకు సూచించిన సుప్రీంకోర్టు

Supreme Court on NEET Row 2024: NEET UG 2024 వివాదం ఇంకా రేగుతూనే ఉంది. గ్రేస్ మార్కుల్ని తొలగించి 1563 మంది విద్యార్ధులకు రీ టెస్ట్ నిర్వహించనున్నా..వివాదం మాత్రం ఇంకా తొలగలేదు. నీట్ అక్రమాలను సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది.

నీట్ 2024 పరీక్షలో 0.001 శాతం నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వాలకు సూప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పరీక్ష నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా సీరియస్‌గా పరిగణించాల్సిందేనని తెలిపింది. వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్‌వి భట్టిలు ఎన్టీఏ తరపు హాజరైన న్యాయవాదులకు సూచించారు. నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏ ఈ విషయంపై కఠిన వైఖరి తీసుకుని ఉండాలని అవసరమైతే తప్పు చేసినవారిని శిక్షించాలని స్పష్టం చేసింది. నీట్ 2024 పరీక్ష ఈ ఏడాది మే 5 వతేదీన దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4750 కేంద్రాల్లో జరిగింది. మొత్తం 24 లక్షలమంది పరీక్షకు హాజరయ్యారు. 

ఎన్టీయే అనేది అన్నింటికీ కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. తప్పు జరిగితే అవును తప్పు జరిగిందని ఒప్పుకోవాలని తెలిపింది. మేం ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పగలగాలని వెల్లడించింది. ఇలా చేస్తే కనీసం నీట్ సామర్ధ్యంపై అందరికీ నమ్మకం కుదురుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బట్టి చేసిన ఈ వ్యాఖ్యలను మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ కూడా సమర్ధించారు. నీట్‌పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా కోర్టు పరిగణించింది. నీట్ అభ్యర్ధులు, విద్యావేత్తలు దాఖలు చేసిన పిటీషన్లను వ్యతిరేకమైనవిగా భావించవద్దని సుప్రీంకోర్టు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఎన్టీయేకు నిర్దేశించింది. వ్యవస్థను మోసం చేసి వైద్యుడు కావాలని ఎవరైనా అనుకుంటే అది సమాజానికి చాలా పెద్ద ద్రోహమని కోర్టు అభివర్ణించింది. ఎంతో కష్టపడి పరీక్షలు రాసిన లక్షలాదిమంది విద్యార్ధుల ప్రయత్నాలను కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. 

జూలై 6 నుంచి మెడికల్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ జరగనుండటంతో నీట్ వివాదంపై దర్యాప్తు జరిపించాలనేది ప్రధానంగా పిటీషనర్లు కోరుతున్నారు. రెండు వారాల్లో ఎన్టీయే, కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

Also read: Delhi Best Markets: ఢిల్లీ వెళ్తున్నారా, షాపింగ్ చేయాలంటే 5 చీప్ అండ్ బెస్ట్ మార్కెట్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More