Home> జాతీయం
Advertisement

Supreme Court on Manipur: ఆగస్టు 4 మద్యాహ్నం 2 గంటలకు హాజరుకావల్సిందే, మణిపూర్ డీజీపీకు సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court on Manipur: మణిఫూర్ హింస ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ కేసుకు ప్రాధాన్యత పెరిగింది. మణిపూర్ హింసపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Supreme Court on Manipur: ఆగస్టు 4 మద్యాహ్నం 2 గంటలకు హాజరుకావల్సిందే, మణిపూర్ డీజీపీకు సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court on Manipur: మణిపూర్ హింసపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటి నుంచి కీలకమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మణిపూర్ పోలీసులపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం, పోలీసులు రెండూ విఫలమయ్యాయని అభిప్రాయపడింది. 

మణిపూర్ హింసపై ఎట్టకేలకు నిజానిజాలు బయటకు వచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్‌గా తీసుకోవడమే కాకుండా అక్కడి ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో తీవ్రంగా విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం అంటే ఆగస్టు 4వ తేదీ మద్యాహ్నం 2 గంటలకు తమ ముందు హాజురుకావల్సిందిగా మణిపూర్ డీజీపీని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ కేసులో అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోందని కోర్టు మండిపడింది. ఎఫ్ఐఆర్ దాఖలు సైతం సరిగ్గా లేదని ఆగ్రహించింది. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణను అదుపులోకి తీసుకురావడంతో పోలీసులు చేతులెత్తేశారని కోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది. 

మణిపూర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు జూన్ 20వ తేదీన కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు మహిళల్ని వివస్త్రల్ని చేసి ఊరేగించిన ఘటన ఆందోళనకు గురి చేసిందన్నారు. ఈ తరహా దాడులు ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ కేసు విచారిస్తోంది. 

మహిళల ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్ని అందించాలని మణిపూర్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన జరిగిన చోటు, జీరో ఎఫ్ఐఆర్, రెగ్యులర్ ఎఫ్ఐఆర్ తేదీలు, 6 వేల ఎఫ్ఐఆర్‌లలో ఎంతమంది నిందితుల పేర్లు చేర్చారు, అరెస్టుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు వివరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ కమిటీ లేదా సిట్ ఏర్పాటు చేయనుంది.

Also read: Heavy Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More