Home> జాతీయం
Advertisement

'దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపే': సుప్రీంకోర్టు

దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
 

'దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపే': సుప్రీంకోర్టు

Supreme Court: దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) కొట్టివేసింది. ఓ బాలిక దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని పేర్కొంటుందంటూ అప్పట్లో బాంబే హైకోర్టు(Bombay High Court) వ్యాఖ్యానించింది. 

లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల(Sexual assault) కిందకు వస్తుందని వెల్లడించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టం ఉద్దేశాన్ని నాశనం చేస్తుందని, నిందితుడు చట్టం నుంచి తప్పించుకునేందుకు దోహదపడుతుందని.. న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, ఎస్ రవీంద్ర భట్, బేలా త్రివేదిలతో కూడిన సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

Also Read: సంచలన నిజాలు వెల్లడించిన నటి షాలు చౌరాసియా..పొదల్లోకి తోసి లైంగిక దాడికి పాల్పడ్డాడు

కేసును పరిశీలిస్తే...
2016లో 39 ఏళ్ల సతీష్‌ అనే వ్యక్తి  12 ఏళ్ల బాధిత బాలిక(Girl)కు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతిని తాకి ఆమె దుస్తులు విప్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో భయంతో బాలిక కేకలు వేయడంతో.. తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా దిగువ కోర్టు.. సాక్ష్యాదారాలను పరిశీలించి నిందితుణ్ని పోక్సో చట్టం(POCSO Act) కింద దోషిగా తేలుస్తూ శిక్షలు విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా సంచలన తీర్పు వెలువరించింది.

'ఈ కేసులో నిందితుడు బాలిక ఛాతిని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా లేదా దుస్తుల లోపలికి చేయి పెట్టాడా అన్న నిర్దిష్టమైన వివరాలు లేవు కావున…దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేం' అని పేర్కొంది.  నాగ్‌పుర్‌ బెంచ్‌కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలాతో కూడిన ఏక సభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. ఆ కేసులో నిందితుడికి పోక్సో చట్టంలోని సెక్షన్‌ 8(చిన్నారులపై లైంగిక దాడి) కింద మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. అయితే నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 354(ఓ మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్‌ 342(దురుద్దేశంతో నిర్బంధించడం) కింద దిగువ కోర్టు విధించిన ఒక ఏడాది కఠిన కారాగార శిక్షను మాత్రం సమర్థించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More