Home> జాతీయం
Advertisement

SC orders Maharashtra floor test | మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం(Maharashtra crisis) నెలకొన్న నేపథ్యంలో నవంబర్ 27న బుధవారం నాడు అసెంబ్లీలో బల పరీక్ష చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు(Supreme Court orders) ఆదేశించింది.

SC orders Maharashtra floor test | మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం(Maharashtra crisis) నెలకొన్న నేపథ్యంలో నవంబర్ 27న బుధవారం నాడు అసెంబ్లీలో బల పరీక్ష చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు(Supreme Court orders) ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు(Maharashtra govt formation) విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ శివసేన(Shiv Sena), ఎన్సీపీ(NCP), కాంగ్రెస్(Congress) పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి ఏకపక్షంగా వ్యవహరించారని మూడు పార్టీలో తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శనివారం దాఖలైన పిటిషన్‌పై వరుసగా ఆదివారం, సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.. అసెంబ్లీలో బల పరీక్ష ఎప్పుడు చేపట్టాలనే తీర్పును మంగళవారానికి రిజర్వ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. సోమవారం నాటి విచారణకు కొనసాగింపుగా మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు.. అంతిమంగా బుధవారం బల పరీక్ష నిర్వహించాల్సిందిగా స్పష్టంచేసింది.

Read also : మహారాష్ట్ర: బల పరీక్షపై తీర్పును సస్పెన్స్‌లో పెట్టిన సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు ఆదేశాలతో బల పరీక్ష ఎప్పుడు ఉంటుందనే ఉత్కంఠకు తెరపడినప్పటికీ.. ఇప్పుడే అసలు ఉత్కంఠ మొదలైంది. బల పరీక్ష నిర్వహించే లోగా ఏ పార్టీకి ఎంత మంది మద్దతు పలుకుతారు ? ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయిస్తారు ? ఏయే పార్టీలు ఎమ్మెల్యేలను చేజారిపోకుండా కాపాడుకోవడంలో సఫలమవుతాయి ? ఎవరు విఫలమవుతారనేది బల పరీక్ష పూర్తయ్యే వరకు చెప్పలేని పరిస్థితి మహారాష్ట్రలో నెలకొంది.

Read More