Home> జాతీయం
Advertisement

Punjab New CM: పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా!

పంజాబ్  కాంగ్రెస్ లో సంక్షోభానికి తెరపడింది. పంజాబ్‌ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావాను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. 

Punjab New CM: పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా!

Punjab New CM Sukhjinder Singh Randhawa: పంజాబ్‌లో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్‌ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ సింగ్ రణదావా(Sukhjinder Singh Randhawa)ను కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేసింది. కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ స్థానంలో సుఖ్‌జిందర్‌ను ఎన్నుకున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. అమరీందర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం సుఖ్‌జిందర్‌కు ఉంది. కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావాకు పేరు ఉంది. అధిష్టానం దూతలు ఎమ్మెల్యేలతో సమావేశమైన తరువాత ఆయన పేరును ప్రతిపాదించారు.

సుఖ్‌జిందర్‌ సింగ్‌ 1959లో ఏప్రిల్‌ 25న జన్మించారు. ప్రస్తుతం డేరా బాబా నానక్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫతేఘర్‌ చురైన్‌ నుంచి 2002లో తొలిసారి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2012, 2017 ఎన్నికల్లో డేరాబాబా నానక్‌ నుంచి విజయం సాధించారు.

సీఎం రేసులో పలువురి పేర్లు..
అయితే.. పంజాబ్‌ సీఎం రేసులో పలువురి పేర్లు వినిపించాయి. పీసీసీ చీఫ్‌ సిద్ధూతో పాటు మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్‌ జాఖడ్‌, మాజీ సీఎం రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌, ప్రతాప్‌ సింగ్‌ భజ్వా, రణ్వీత్‌ బిట్టు, మంత్రి సుఖ్జీందర్‌ సింగ్‌ రంధావా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సీనియర్‌ నేత అంబికా సోనీ(Ambika Soni) పేరు తెరపైకొచ్చినా.. తాను సీఎం రేసులో లేనని ప్రకటించారామె. 

Also Read; Breaking News: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరిందర్ సింగ్

సిద్ధూను సీఎంగా అంగీకరించేది లేదు: అమరీందర్
సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్(Amarinder Singh)రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పంబాజ్ తదుపరి సీఎం ఎవరన్న సస్పెన్స్ కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే.. సీఎంగా పీసీసీ చీఫ్ సిద్ధూ(Navjot Singh Sidhu)ను అంగీకరించేది లేదని అమరీందర్ సింగ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. సిద్ధూకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని.. ఆయన సీఎం కావడం దేశ భద్రతకు విఘాతమని శనివారంనాడు తీవ్ర ఆరోపణలు చేశారు.

పంజాబ్ గవర్నర్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. .  గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూతో నెలకొన్న ఆధిపత్య పోరు చివరికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేసే పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ అధినేత్రి ఆదేశాల మేరకు అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. ఈ సాయంత్రం ఐదు గంటలకు పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరుగుతోన్న నేపథ్యంలో అమరీందర్ రాజీనామా చేయడం విశేషం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More