Home> జాతీయం
Advertisement

ఆ స్థలాల్లో ముస్లిములు నమాజ్ చేయవద్దు: వసీం రిజ్వీ

యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు అధినేత డాక్టర్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆ స్థలాల్లో ముస్లిములు నమాజ్ చేయవద్దు: వసీం రిజ్వీ

యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు అధినేత డాక్టర్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకి ఆయన ఉత్తరం రాస్తూ.. మత వివాదాలతో కూడిన కొన్ని ప్రదేశాల్లో ముస్లిములు నమాజ్ చేయకూడదని తెలిపారు. అటువంటి ప్రదేశాలు భారతదేశంలో కనీసం తొమ్మిది ఉన్నాయని ఆయన తెలిపారు. అటువంటి ప్రదేశాల్లో ముస్లిములు ప్రార్థనలు దయ చేసి చేయవద్దని ఆయన కోరారు.

కొన్ని ప్రదేశాల్లో ముస్లిం రాజులు, హిందు దేవాలయాలను పడగొట్టి.. అక్కడ మసీదులు కట్టినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని.. అటువంటి ప్రదేశాల్లో నమాజులు చేయవద్దని ఆయన తెలిపారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఏవైనా ఇతర మతాల ఆలయాలు పడగొట్టి.. ఆ చోట మసీదులు కట్టడం అనైతికమని.. అలా కట్టిన మసీదుల్లో ప్రార్థనలు చేయడాన్ని ఖురాన్ గానీ.. షరియా చట్టాలు గానీ సమర్థించవని ఆయన చెప్పారు. 

Read More