Home> జాతీయం
Advertisement

SSC GD 2025: SSC GD కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ విడుదల.. 39,481 పోస్టుల భర్తీకి కేవలం 10 పాసైతే చాలు..

Staff Selection Notification 2025 Out:  SSC GD 2025 అప్లికేషన్‌ ఫారమ్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తుకు నేరుగా SSC GD అధికారిక వెబ్‌సైట్‌ SSC.gov.in లో వెంటనే అప్లై చేసుకోండి. చివరి తేదీ అక్టోబర్‌ 14. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఈ నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదవాలి. 

SSC GD 2025: SSC GD కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ విడుదల.. 39,481 పోస్టుల భర్తీకి కేవలం 10 పాసైతే చాలు..

Staff Selection Notification 2025 Out: స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్‌ 39481 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఈ ఖాళీల భర్తీ చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల కనేవారికి ఇది బంపర్‌ ఆఫర్.  ఆ వివరాలు తెలుసుకుందాం.

SSC GD 2025 అప్లికేషన్‌ ఫారమ్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తుకు నేరుగా SSC GD అధికారిక వెబ్‌సైట్‌ SSC.gov.in లో వెంటనే అప్లై చేసుకోండి. చివరి తేదీ అక్టోబర్‌ 14. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఈ నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదవాలి. 

స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) SSC GD 2025 పోస్టుల భర్తీ చేపట్టింది. తద్వారా 39,841 పోస్టుల భర్తీ చేపట్టింది. ఈరోజు నుంచి అంటే సెప్టెంబర్‌ 5 నుంచి ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ ఫీజు ఇతర వివరాలు తెలుసుకోండి. అప్లికేషన్‌ కరెక్షన్‌ విండో 2024 నవంబర్‌ 5 వరకు అందుబాటులో ఉంటుంది.

SSC GD పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష ఇందులో అభ్యర్థులు జనరల్‌ డ్యూటీ (GD) పోస్టుల భర్తీ చేయనుంది. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఎన్‌ఐఏ, ఐటీబీపీ, ఏఆర్‌, ఎస్‌ఎస్‌ఎఫ్ పోస్టుల భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేష్‌ ద్వారా రెండూ మగ, ఆడ ఇద్దరు అభ్యర్థుల భర్తీ చేయనున్నారు. టైర్‌ 1 ఎగ్జామ్‌ 2025 జనవరి లేదా ఫిబ్రవరీలో నిర్వహించనుంది.

SSC GD కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌ ప్రతి ఏడాది నిర్వహిస్తోంది. వేలాది మంది ప్యారమిలటీలో జాయిన్‌ అవ్వడానికి ఎదురు చూస్తుంటారు. ఈ రిక్రూట్మెంట్‌ రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, దేహదారుఢ్యపరీక్ష. రెండిటిలో పాసైన వారికి కానిస్టేబుల్‌, రైఫిల్‌మెన్‌, BSF, CIF, SSB, NIA, ITBP,AR పోస్టుల భర్తీ చేయనున్నారు.

ఇదీ చదవండి: వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించిన జియో.. జొమాటో గోల్డ్‌ మెంబర్‌షిప్‌, 10 జీబీ డేటా ఫ్రీ..!

SSC GD నేడు యాక్టివేషన్‌ లింక్‌తో ఇదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు కేవలం పది పాసైతే చాలు. వారి వయస్సు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబర్‌ 14 వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: జియో సిమ్‌ ఇంట్లోనే ఇలా సింపుల్‌గా యాక్టివేట్‌ చేసుకోండి.. వివరాలు మీకోసం..

అప్లై చేసుకునే విధానం..
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ssc.gov.in డైరెక్ట్‌ లింక్‌ ఓపెప్‌ చేయాలి.
ఆ తర్వాత యూజర్‌ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుం. 
రిజిస్ట్రేషన్‌ నంబర్‌ , పాస్వర్డ్‌ ఆధారంగా లాగిన్‌ అవ్వాలి.దీనికి ఇమెయిల్‌ ఐడీ అవసరం ఉంటుంది. 
ఇక్కడ మీరు కావాల్సిన డాక్యుమెంట్స నిర్ధిష్ట సైజులో అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సంతకం కూడా గైడ్‌లైన్స్ ప్రకారం అప్లోడ్‌ చేయాలి. లేకపోతే అప్లికేషన్‌ తిరస్కరించే అవకాశం ఉంటుంది.
చివరగా మీ వివరాలను ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఫీజు ఆన్‌లైన్‌ లో చెల్లించాలి. ఇది కేవలం ఆన్‌లైన్‌ మోడ్‌లోనే చేయాలి. చివరగా సబ్మిట్‌ చేసిన SSC GD అప్లికేషన్‌ డౌన్లోడ్‌ చేసుకోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More