Home> జాతీయం
Advertisement

శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకొచ్చే సమయం

శ్రీదేవి భౌతికకాయం భారత్ కి తరలించడంలో ఇంకొంత జాప్యం

శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకొచ్చే సమయం

బాలీవుడ్ నటి శ్రీదేవి భౌతికకాయం ఇంకొద్దిసేపట్లో ముంబైకి చేరుకోనుంది. దుబాయ్ కాలమానం ప్రకారం అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్ కి తరలించే ప్రైవేట్ జెట్ బయల్దేరుతుందని దుబాయ్ లో వున్న భారత రాయబార కార్యాలయం అధికారి ఒకరు తెలిపారు. భారత్ కి, దుబాయ్ కి మధ్య 1 గంట 30 నిమిషాల కాలవ్యవధి వుంది. ఆ విధంగా భారత కాలమానం ప్రకారం శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకొచ్చే ప్రైవేట్ జెట్ అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు బయల్దేరుతుందని అధికారవర్గాలు తెలిపాయి. దుబాయ్ - భారత్ మధ్య విమాన ప్రయాణానికి ఎయిర్ క్రాఫ్ట్ వేగ సామర్థ్యాన్నిబట్టి 2 గంటల నుంచి 3:15 గంటల సమయం పడుతుంది. 

భారత రాయబార కార్యాలయం ప్రకటించిన సమయానికి శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకొస్తున్న ప్రైవేట్ జెట్ అక్కడి నుంచి బయల్దేరినట్టయితే, సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆ విమానం ముంబైకి చేరుకునే అవకాశం వుంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనుకున్న సమయానికి ఆ ప్రైవేట్ జెట్ బయల్దేరలేదని తెలుస్తోంది. అదేకానీ జరిగితే శ్రీదేవి భౌతికకాయం భారత్ కి చేరడం ఇంకొంత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. 

BRIEF SUMMARY:

Indian Consulate official in Dubai has confirmed that according to Dubai time, actress Sridevi's mortal remains will be ready for repatriation between 1pm to 2pm. Notably, the time difference between India and Dubai is 1 hour 30 minutes. So the mortal remains may leave from Dubai by 3:30pm Indian Standard Time, reports ANI.

 

 

Read More