Home> జాతీయం
Advertisement

కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో పలు కీలక మార్పులు జరిగాయి.

కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో పలు కీలక మార్పులు జరిగాయి. కేంద్ర ఆర్థికశాఖ ఇన్‌ఛార్జ్‌గా పీయూష్‌ గోయల్‌ను నియమిస్తూ ప్రధానమంత్రి నిర్ణయించారు. అయితే, జైట్లీ కోలుకునే వరకు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అటు స్మృతి ఇరానీని సమాచార, ప్రసార బాధ్యతల నుంచి తప్పించి క్రీడా మంత్రిగారాజ్యవర్ధన్‌ రాథోడ్ కు అప్పగించారు. స్మృతి ఇరానీకి జౌళి శాఖ బాధ్యతలు అప్పగించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న మంత్రివర్గ ప్రక్షాళన ప్రాధాన్యత సంతరించుకుంది.

2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను సీనియర్‌ నాయకుడు అరుణ్‌జైట్లీ నిర్వహిస్తూ వచ్చారు. కొద్ది మాసాలుగా అనారోగ్యంతో బాధపతున్న జైట్లీ సోమవారం కిడ్నీ ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు గోయెల్‌ ఆర్థికమంత్రిగా కొనసాగుతారు. అదేవిధంగా,  తాగునీరు, పారిశుద్ధ్యశాఖ సహాయమంత్రిగా ఉన్న ఎస్‌ఎస్ అహ్లువాలియాను ఆ శాఖ నుంచి మార్చి ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖను అప్పగించారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రిగా ఉన్న అల్ఫోన్స్ కన్నంథనం పర్యాటకశాఖ సహాయమంత్రిగా కొనసాగుతారు.

Read More